TSPSC AEE Ranker Success Story : టీఎస్‌పీఎస్సీ ఏఈఈ ఫలితాల్లో అభినవ్ స‌త్తా.. రాష్ట్ర స్థాయిలో 8వ ర్యాంక్ కొట్టాడిలా..

ఇటీవ‌ల పోటీప‌రీక్ష‌ల‌కు ప్రిపేర‌య్యే యువ‌త‌.. ఎన్ని అవాంత‌రాలు ఎదురైన.. అనుకున్న ల‌క్ష్యం సాధిస్తున్నారు. ఇటీవ‌లే తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించిన ఏఈఈ పోస్టుల ఫలితాలు విడుద‌లైన విష‌యం తెల్సిందే.

ఈ ఫ‌లితాల్లో.. తెలంగాణ‌లోని హనుమకొండలోని అడ్వకేట్స్‌ కాలనీకి చెందిన కరిమిల్ల అభినవ్‌ రాష్ట్ర స్థాయి 8వ ర్యాంకు సాధించారు. 

ఎంతో కాలం ఎదురుచూసి.. చివ‌రికి
2022 సెప్టెంబర్‌లోనే ఏఈఈ సివిల్‌ పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 2023 మే 21న రాత పరీక్ష నిర్వహించింది. ఈ ఫ‌లితాలను చాలా రోజులు త‌ర్వాత‌.. టీఎస్‌పీఎస్సీ ఇటీవల విడుదల చేసింది. ఈ ఫలితాల్లో అభినవ్‌ రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ర్యాంకు సాధించారు. 

☛➤ UPSC Civils Ranker Kote Anil Kumar : బలమైన కోరికతోనే..ఏఈ ఉద్యోగాన్ని వ‌దిలేసి.. సివిల్స్ వైపు వ‌చ్చా.. కానీ..

కుటుంబ నేప‌థ్యం : 
అభినవ్‌.. వరంగల్‌ జిల్లా వర్ధన్నపేట మండలం చెన్నారం గ్రామానికి చెందిన వారు. వీరి నాన్న కరిమిల్ల వెంకటేశ్వర్‌ రావు. ఈయ‌న‌ రిటైర్డ్‌ టీచర్‌. అమ్మ‌ సుకన్య. 

☛➤ APPSC Group 1 Ranker: అమ్మ కష్టం, త్యాగం.. నన్ను గ్రూప్-1 సాధించేలా చేసింది!

త్వరలోనే పోస్టింగ్‌..
తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ రహదారుల భవనాల శాఖలో ఏఈఈ సివిల్‌ పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షకు హాజరై రాష్ట్ర స్థాయి 8వ ర్యాంకు, మల్టీజోన్‌–1లో 2వ ర్యాంకు సాధించి ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు గర్వకారణంగా నిలిచారు. త్వరలో పోస్టింగ్‌ ఇవ్వనున్నారు.

#Tags