TS Government Jobs News 2024 : ఏక్షణంలోనైన 3,500 ఉద్యోగాలకుపైగా భర్తీకి నోటిఫికేషన్... ఎక్కువ పోస్టులు ఇవే...!
ఈ సారి విద్యుత్ శాఖలోని భారీగా ఉద్యోగాల భర్తీకి కసరత్తు చేస్తుందని తెలుస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా 3,500 పోస్టుల భర్తీకి ప్రభుత్వం సన్నద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన విధంగానే జాబ్ క్యాలెండర్ ప్రకారం నియామకాలు పూర్తి చేసే దిశగా రేవంత్ రెడ్డి సర్కార్ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్తు పంపిణీ సంస్థల్లో జూనియర్ లైన్‌మెన్ ఖాళీల పోస్టుల భర్తీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా మొత్తం 3,500 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
1,550 వరకు జూనియర్ లైన్‌మెన్ పోస్టులు :
హైదరాబాద్ కేంద్రంగా ఉన్నవిద్యుత్తు పంపిణీ సంస్థతో పాటు, వరంగల్ కేంద్రంగా ఉన్న విద్యుత్తు పంపిణీ సంస్థలలో భారీగా ఖాళీలు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించినట్లు తెలుస్తోంది. మెుత్తం ఈ విద్యుత్ పంపిణీ సంస్థలలో మొత్తం 3,500 వరకు జూనియర్ లైన్‌మెన్, ఇతర పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఆర్థిక శాఖ గుర్తించింది. ఈ మేరకు ఈ పోస్టుల భర్తీకి నవంబర్ నెలాఖరుకల్లా నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పోస్టులలోనే టీజీఎస్‌పీడీసీఎల్‌లో 1,550 వరకు జూనియర్ లైన్‌మెన్ పోస్టులు సైతం ఉన్నట్లు తెలుస్తోంది. ఈసారి విడుదల చేసే జూనియర్ లైన్‌మెన్ పోస్టులకు మహిళలు కూడా అర్హులే అని వెల్లడించారు. ఏది ఏమైనప్పటికీ ఈనెలాఖరుకల్లా నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది.