Constable Success Story : మా ఊరి నుంచి ఫస్ట్ పోలీస్ అయ్యింది నేనే.. కానీ..!
తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రభుత్వ ఉద్యోగాల జాతరను కొనసాగిస్తోంది. ఇందులో భాగంలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు తుది ఫలితాలు ఇచ్చి.. ఎంపికైన వారికి కూడా ట్రైనింగ్ పూర్తి చేశారు.
సూర్యాపేట జిల్లాకు రామచంద్రాపురం తండా మఠంపల్లి మండలంకు చెందిన ఆంగోతు నాగమణి సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగంకు ఎంపికై.. ఇటీవలే ట్రైనింగ్ కూడా పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆంగోతు నాగమణి సక్సెస్ స్టోరీ మీకోసం...
➤☛ Junior Civil Judge Topper Success Story : ఇక్కడ మిస్సయినా.. అక్కడ టాపర్‌గా నిలిచానిలా... కానీ..
మా ఊరి నుంచి కూడా మొదట పోలీస్ అయ్యింది నేనే..
పేద ప్రజలకు సేవ చేసేందుకు పాడుపడగాతా. నాన్న నర్సింహ, అమ్మ బుజ్జి నన్ను ఎంతో కష్టపడి చదివించారు. మా ఊరి నుంచి కూడా మొదట పోలీస్ అయ్యింది నేనే. చాలా గర్వంగా ఫీలవుతున్నా. ఎస్పీ సార్ చేతుల మీదుగా పోస్టింగ్ ఆర్డర్ అందుకోవడం చాలా సంతోషంగా ఉంది.మొదటి సారి కానిస్టేబుల్ పరీక్ష రాసి ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది. తొమ్మిది నెలల పాటు ఇచ్చిన శిక్షణలో ఎన్నో నేర్చుకున్నాను.
#Tags