విదేశీ వాణిజ్యం

వరల్డ్ ఎకనమిక్ అవుట్ లుక్ ప్రపంచ ఉత్పత్తి వృద్ధిని 2018లో 3.6 శాతం, 2019లో 3.3 శాతంగా అంచనా వేసింది. అమెరికా-చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తత కారణంగా ప్రపంచ ఉత్పత్తి వృద్ధి క్షీణించిందని ‘వరల్డ్ ఎకనమిక్ అవుట్ లుక్’ 2019 ఏప్రిల్ నివేదికలో పేర్కొంది. ప్రపంచ వాణిజ్య సంస్థ అభిప్రాయంలో 2017లో ప్రపంచ వాణిజ్య వృద్ధి 4.6 శాతం నుంచి 2018లో 3 శాతానికి క్షీణించింది. ప్రపంచ వాణిజ్య వృద్ధి క్షీణతకు విత్త మార్కెట్‌లో ఒడిదుడుకులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా నూతన, పోటీతత్వంతో కూడిన చర్యల వల్ల ప్రపంచ ఆర్థిక వృద్ధి క్షీణించిన కారణంగా ప్రపంచ వాణిజ్య వృద్ధి మందగించిందని ప్రపంచ వాణిజ్య సంస్థ పేర్కొంది. మరోవైపు వాణిజ్య ఉద్రిక్తతలతో పాటు, తాత్కాలిక ఒడిదుడుకులు వాణిజ్య, ఉత్పత్తిపై ప్రభావం చూపడం, జర్మనీలో ఆటోమోటివ్ రంగంలో ఉత్పత్తి సమస్యల కారణంగా ప్రపంచ వాణిజ్య వృద్ధి మందగించిందని ప్రపంచ వాణిజ్య సంస్థ పేర్కొంది. ప్రపంచ కమర్షియల్ సేవల వృద్ధి 2017తో పోల్చినపుడు 2018లో తగ్గింది. మరోవైపు వస్తు సంబంధిత సేవల వృద్ధి 2017లో 8.3 శాతంకాగా 2018లో 10.6 శాతంగా నమోదైంది.

   అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల్లో కరెంటు ఖాతా లోటు 2011 తర్వాత కాలంలో మెరుగుపడి 2017లో 444.7 బిలియన్ డాలర్లు మిగులు నమోదైంది. ఇదే కాలంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల కరెంటు ఖాతాలో లోటు పెరిగింది. ఈ స్థితి వెనుకబడిన ఆర్థిక వ్యవస్థలలో వినియోగ స్థాయిలో పెరుగుదలను స్పష్టపరుస్తుంది. భారత్ కరెంటు ఖాతా లోటు 2016-17లో జీడీపీలో 0.6 శాతం కాగా 2017-18లో 1.8 శాతానికి పెరిగింది. 2018-19లో కరెంటు ఖాతా లోటు భారత్‌లో 2.4 శాతంగా ఉండగలదని అంచనా. వస్తు వాణిజ్య లోటు పెరుగుదల అధికంగా ఉండటం భారత్ కరెంటు ఖాతా లోటు పెరుగుదలకు కారణమైంది. 2018-19 సంవత్సరం మొదటి అర్థ భాగంలో క్రూడ్ చమురు ధరల పెరుగుదల కారణంగా భారత్‌లో చెల్లింపుల శేషం స్థితి కొంత మేర ఒత్తిడికి గురైంది. 2018-19 సంవత్సరం మూడో త్రైమాసికంలో అంతర్జాతీయ చమురు ధరలలో తగ్గుదల సంభవించింది. కరెంటు ఖాతా లోటు అధికంగా ఉన్న ముఖ్య ఆర్థిక వ్యవస్థల్లో భారత్ అధిక విదేశీ మారక ద్రవ్య నిల్వలు నిర్వహి స్త్తున్న ఆర్థిక వ్యవస్థగా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా అధిక విదేశీ మారక ద్రవ్య నిల్వలు నిర్వహిస్తున్న దేశాల్లో భారత్ ఎనిమిదో స్థానం పొందింది.

   2018-19లో భారత్ మొత్తం ఎగుమతుల్లో పెట్రోలియం ఉత్పత్తులు అతిపెద్ద ఎగుమతి ఉత్పత్తిగా నిలిచింది. భారత్ మొత్తం ఎగుమతుల విలువలో పెట్రోలియం ఉత్పత్తుల వాటా 2018-19లో 14.1 శాతం. వివిధ ఉత్పత్తుల ఎగుమతుల వృద్ధికి సంబంధించి ఆర్గానిక్ రసాయనాలు ప్రథమ స్థానంలో నిలిచాయి. భారత్ మొత్తం దిగుమతుల విలువలో పెట్రోలియం, క్రూడ్ వాటా 22.2 శాతం కాగా బంగారం, ఇతర విలువైన మెటల్ జ్యూయలరీ వాటా 6.4 శాతంగా నమోదైంది. భారత్‌కు సంబంధించి ఎగుమతి కేంద్రంగా అమెరికా నిలిచింది. 2018-19లో భారత్ మొత్తం ఎగుమతుల విలువలో అమెరికా వాటా 16 శాతం కాగా తర్వాత స్థానాల్లో యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్, చైనా, హాంకాంగ్‌లు నిలిచాయి. 2018-19లో భారత్ ఎగుమతుల వృద్ధి వివిధ దేశాల పరంగా పరిశీలించినప్పుడు నెదర్లాండ్‌‌స ప్రథమ స్థానంలో ఉండగా తర్వాత స్థానాల్లో చైనా, నేపాల్‌లు నిలిచాయి. భారత్ దిగుమతుల విషయంలో చైనాపై అధికంగా ఆధారపడగా తర్వాత స్థానాల్లో అమెరికా, యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా దేశాలు నిలిచాయి.

  ప్రపంచ వ్యాప్తంగా అనేక ముఖ్య ప్రాంతీయ గ్రూపులతో భారత్ ద్వైపాక్షిక వాణిజ్య సంబంధ ఒప్పందాలు చేసుకుంది. సార్‌‌క దేశాలలో భారత్, బంగ్లాదేశ్‌తో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం చేసుకోవడంతో పాటు ద్వైపాక్షిక సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం చేసుకోవాలని భావిస్తుంది. ్కట్ఛజ్ఛట్ఛ్టజ్చీ వాణజ్య ఒప్పందానికి సంబంధించి భారత్, ఇరాన్‌ల మధ్య చర్చలు జరుగుతున్నాయి. కొన్ని ఉత్పత్తులు మినహా అన్ని విధాలైన ఉత్పత్తుల విషయంలో ‘డ్యూటీ-రహిత’ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం శ్రీలంకతో జరిగింది. నూతన ఆర్థిక సాంకేతిక సహకార ఒప్పందాన్ని శ్రీలంకతో చేసుకోవాలని భారత్ చర్చలు జరుపుతుంది.
 
మాదిరి ప్రశ్నలు :








































































#Tags