TS Inter Results 2024 Live Updates: తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు వచ్చేశాయి.. లైవ్‌ అప్‌డేట్స్‌

TS Inter Results 2024 Live Updates

TS Inter Results 2024 Live Updates:

 తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు విడుదల అయ్యాయి. 
ఒకేసారి ఫస్టియర్‌, సెకండియర్‌ ఫలితాలు విడుదల

ఫస్ట్‌ ఇయర్‌లో 60 శాతం ఉత్తీర్ణత
2, 87, 261మంది పాసయ్యారు

సెకండ్‌ ఇయర్‌లో 64 శాతం ఉత్తీర్ణత
సెకండ్‌ ఇయర్‌లో 3,22,432 మంది పాస్

ఇంటర్‌ ఫలితాల్లో బాలికలదే పైచేయి

►ఫస్టియర్‌ ఫలితాల్లో రంగారెడ్డి జిల్లా టాప్‌ 
►సెకండ్‌ ఇయర్‌ ఫలితాల్లో ములుగు జిల్లా ఫస్ట్‌

సాయంత్రం 5 గంటల నుంచి ఆన్‌లైన్‌లో మార్కుల మెమోలు 

రేపటి నుంచి వచ్చే నెల 2 దాకా రీవ్యాల్యూయేషన్‌, రీ వెరిఫికేషన్‌కు ఛాన్స్‌.. దరఖాస్తు చేసుకోవాలి

మే 24 నుంచి ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు

 

ఇంటర్‌ ఫలితాల 2024 కోసం 👇 క్లిక్‌ చేయండి :

☛ ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

☛ ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ ఒకేషనల్‌ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

☛ ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

☛ ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ ఒకేషనల్‌ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

 

తెలంగాణ ఇంటర్మీడియట్‌ విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫలితాల సమయం వచ్చేసింది. తెలంగాణ ఇంటర్మీడియట్‌ ఫలితాలు విడుదల అయ్యాయి.ఉదయం 11గంటలకు నాంపల్లిలోని ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, బోర్డు కార్యదర్శి శృతి ఓజా ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌ ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు.

తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షలు ఫిబ్రవరి 28 నుంచి మార్చ్ 18 వరకూ జరిగాయి. ఆ తరువాత పరీక్ష పత్రాల మూల్యాంకనం కూడా పూర్తయింది. తరువాత ఆన్‌లైన్ మార్కుల నమోదు, కోడింగ్, డీ కోడింగ్ ప్రక్రియ జరిగింది.

మొత్తం 9 లక్షలకు పైగానే..
ఎన్నికల సంఘం అనుమతి కూడా లభించడంతో ఇవాళ ఉదయం 11 గంటలకు ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు. తెలంగాణలో మొత్తం 9,80,978 మంది  ఇంటర్ పరీక్షలు రాశారు. 4 లక్షల 78 వేల 527 మంది ఫస్టియర్‌ పరీక్షలు రాయగా,  4 లక్షల 43 వేల 993 మంది విద్యార్థులు సెకండ్‌ ఇయర్‌ పరీక్షలకు హాజరయ్యారు. 

#Tags