Inter Admissions: మిగులు సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

కల్వకుర్తి టౌన్‌: జిల్లాలోని ఎస్సీ గురుకులాల్లో ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో మిగిలిన సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా గురుకులాల అధికారి దానం మే 29న‌ ఒక ప్రకటనలో తెలిపారు.

జిల్లాలో ఉన్న 9 కళాశాలల్లో ఎంపీసీ, బైపీసీ, ఎంఎల్‌టీ, సీజీటీ కోర్సులలో సీట్లు ఉన్నాయన్నారు. 2023– 24 విద్యా సంవత్సరంలో పదో తరగతి పాసైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

చదవండి: Software jobs: ఇంటర్‌ విద్యతో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం

దరఖాస్తులు www.tswreis.ac.in వెబ్‌సైట్‌లో రూ.100 రుసుంతో శుక్రవారంలోగా దరఖాస్తు చేసుకోవాలని, పూర్తి వివరాలకు సమీపంలోని ఎస్సీ గురుకుల కళాశాలలో సంప్రదించాలని సూచించారు.

#Tags