Inter Board: బోర్డు నిబంధనలకు అనుగుణంగా పరీక్షలు నిర్వహించాలి..

విద్యార్థులకు జరగనున్న బోర్డు పరీక్షలను పకడ్బందీగా జరపాలని జిల్లా కలెక్టర్‌ తెలిపారు. శుక్రవారం నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న పలు అధికారులు ఏర్పాట్ల గురించి సూచించారు..

మంచిర్యాలఅర్బన్‌: ఇంటర్మీడియెట్‌ పరీక్షలు బోర్డు నిబంధనలకు అనుగుణంగా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) మోతి లాల్‌ అన్నారు. శుక్రవారం ఐడీఓసీ సమావేశం మందిరంలో డీఐఈవో శైలజ అధ్యక్షతన చీఫ్‌ సూపరింటెండెంట్‌, డిపార్ట్‌మెంట్‌ అధికారుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షల నిర్వహణలో అలసత్వం వహించొద్దని సూచించారు. డీఐఈవో శైలజ మాట్లాడుతూ విద్యార్థులు హాల్‌టికెట్లను ఆన్‌లైన్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకుని నేరుగా కేంద్రాలకు వెళ్లి పరీక్ష రాయొచ్చని తెలిపారు.

Police Constable Exam Cancelled: కానిస్టేబుల్ పరీక్ష రద్దు.. అభ్యర్థులకు ఉచిత సౌకర్యాలు..

జిల్లాలో 25 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా.. ప్రథమ సంవత్సరం 8,394 మంది, ద్వితీయ సంవత్సరం 7,135 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు. ఈ నెల 28 నుంచి మార్చి 16 వరకు పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో డిస్ట్రిక్ట్‌ ఎగ్జామినేషన్‌ కమిటీ సభ్యులు శరత్‌కుమార్‌, నగేశ్‌, వివిధ కళాశాలల చీఫ్‌ సూపరింటెండెంట్‌, డిపార్ట్‌మెంట్‌ అధికారులు, ఫ్లయింగ్‌స్క్వాడ్‌, కస్టోడియన్‌లు పాల్గొన్నారు.

#Tags