TS Inter Supplementary Exam 2024: ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు మే 24వ తేదీ నుంచి .....

ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు మే 24వ తేదీ నుంచి .....
TS Inter Supplementary Exam 2024: ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు మే 24వ తేదీ నుంచి .....

ఆదిలాబాద్‌ : ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు ఈనెల 24 నుంచి ప్రారంభం కానున్నా యి. ఇందుకోసం ఇంటర్మీడియెట్‌ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రథమ సంవత్సరం విద్యార్థులకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నట్లు డీఐఈవో రవీందర్‌ కుమార్‌ తెలిపారు. జిల్లాలో 14 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

Also Read :  Study Material

ప్రథమ సంవత్సరం విద్యార్థులు 3,240 పరీక్షలకు హాజ రుకానున్నట్లు తెలిపారు. ఇందులో జనరల్‌ విద్యార్థులు 3,293 మంది, ఒకేషనల్‌ 127 మంది ఉన్నా రు. అలాగే ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 2,451మంది హాజరుకానున్నారు. ఇందులో జనరల్‌ విద్యార్థులు 2,229 మంది, ఒకేషనల్‌ విద్యార్థులు 222 మంది ఉన్నారు. పరీక్షల నిర్వహణ కోసం 14 మంది సీఎస్‌, 14 మంది డీవోలు, ఒక ఫ్లయింగ్‌, ఒక సిట్టింగ్‌ స్క్వాడ్‌ను నియమించినట్లు వివరించారు. ప్రశ్నపత్రాల కోసం ఏడు స్టోరేజ్‌ పాయింట్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మంగళవారం ఆర్‌ఐవో కార్యాలయంలో సీఎస్‌, డీవోల సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

#Tags