Errors in Inter Question Paper : మూడు స‌బ్జెక్టుల్లో ఆరు త‌ప్పులు.. ఇంట‌ర్ విద్యార్థుల ఆందోళ‌న‌..

ఈ నెల‌లో ఇంట‌ర్ ప‌రీక్ష‌లు ప్రారంభమైయ్యాయి. ఇప్ప‌టికే కొన్ని ప‌రీక్ష‌లు కూడా పూర్తి అయ్యాయి.

సాక్షి ఎడ్యుకేష‌న్‌: ఈ నెల‌లో ఇంట‌ర్ ప‌రీక్ష‌లు ప్రారంభమైయ్యాయి. ఇప్ప‌టికే కొన్ని ప‌రీక్ష‌లు కూడా పూర్తి అయ్యాయి. అయితే, ఇటీవ‌ల జ‌రిగిన ఇంగ్లీష్ ప‌రీక్ష‌లో ఒక ప్ర‌శ్నకు ప్రింట్ సరిగ్గాలేక విద్యార్థులు ఇబ్బంది ప‌డ్డారు. ఈ విష‌యాన్ని ఇన్విజిలేట‌ర్లు విద్యాశాఖ వ‌ద్ద‌కు కూడా చేర్చారు. ఇది ముగిసింద‌నుకుంటే, తాజాగా.. ఇంటర్‌ పరీక్షల్లో బుధవారం నిర్వ‌హించిన‌ బోటనీ ప‌రీక్ష‌లో కూడా రెండు, గణితంలో ఒక ప్రశ్న చొప్పున తప్పులు ఉన్న‌ట్లు మ‌రోసారి వెలుగులోకి వ‌చ్చాయి.

Engineering Fees : రానున్న రోజుల్లో భారీగా పెర‌గ‌నున్న ఇంజినీరింగ్ ఫీజులు.. ఏకంగా 2 ల‌క్ష‌లు..

దీంతో, విద్యార్థులు ప‌రీక్ష స‌మ‌యంలో తీవ్ర ఆవేద‌న చెందుతున్నారు. అయితే, బోటనీలో 5,7 ప్రశ్నల్లో తప్పులు, గణితంలో 4వ ప్రశ్న తప్పుగా ఇచ్చింద‌న్నారు విద్యార్థులు.

బుధ‌వారం 3 మాల్‌ప్రాక్టీస్ కేసులు న‌మోదు..

మంగళవారం నిర్వ‌హించిన ప‌రీక్ష‌లో ఏకంగా మూడు సబ్జెక్టుల్లో ఆరు తప్పులు వెలుగుచూశాయి. సోమవారం ఇంగ్లిష్‌ ప్రశ్నపత్రం మసకగా ముద్రితంకావడంతో విద్యార్థులకు 4 మార్కులు కేటాయించారు. దీంతో విద్యార్థుల్లో మ‌రింత ఆందోళన నెలకొంది. రానున్న ప‌రీక్ష‌ల్లో ఎలా ఉంటుంద‌ని భ‌యాందోళ‌నకు గుర‌వుతున్నారు.

AP EAPCET 2025 Full Details : EAPCET-2025 నోటిఫికేషన్‌ విడుదల... ముఖ్య‌మైన తేదీలు ఇవే..

ప‌రీక్ష ప‌త్రాల్లో తప్పులను గుర్తించిన అధికారులు వాటిని సవరించుకోవాలని సూచిస్తున్నారు. బుధవారం 3 మాల్‌ప్రాక్టీస్‌ కేసులు నమోదయ్యాయి. నిజామాబాద్‌ జిల్లాలో 2, సిద్దిపేటలో 1 చొప్పున నమోదయ్యాయి. మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడ్డ విద్యార్థులను అధికారులు డిబార్‌ చేశారు. 4,67,289 మంది విద్యార్థులకు 4,54,031 మంది పరీక్షకు హాజరుకాగా, 13,258 మంది (2.83శాతం) గైర్హాజరయ్యారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

#Tags