Intermediate: విద్యార్థులు సులభంగా పాసయ్యేందుకు (ఈజీ టు పాస్‌) మెటీరియల్‌

సూర్యాపేట టౌన్‌: ఫిబ్ర‌వ‌రి 28వ తేదీ నుంచి జరగనున్న ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఇంటర్మీడియట్‌ అధికారి (డీఐఈఓ) జానపాటి కృష్ణయ్య అన్నారు.

ఫిబ్ర‌వ‌రి 23న‌ జిల్లా కేంద్రంలోని డీఐఈఓ కార్యాలయంలో సీఎస్‌లు, డీఓలు, కస్టోడియన్లు, స్క్వాడ్‌లతో నిర్వహించిన ఓరియెంటేషన్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. విధి నిర్వహణలో అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు. జిల్లాలో 16,602 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారని తెలిపారు. ఎలాంటి మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడకుండా పరీక్షలు ప్రశాంతమైన వాతావరణంలో జరిగేలా చూడాలన్నారు.

చదవండి: టిఎస్ ఇంటర్ - సీనియర్ ఇంటర్ | టైం టేబుల్ 2024 | సిలబస్ | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | న్యూస్ | ఏపీ ఇంటర్

అనంతరం డీఈసీ మెంబర్‌ శ్రీధర్‌ ఆధ్వర్యంలో ఒకేషనల్‌ విద్యార్థులకు సులభంగా పాసయ్యేందుకు తయారు చేసిన(ఈజీ టు పాస్‌) మెటీరియల్‌ను డీఐఈఓ కృష్ణయ్య, డీఈసీ సభ్యులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డీఈసీ సభ్యులు రుద్రంగి రవి, జి.లక్ష్మయ్య, ప్రిన్సిపాళ్లు రాకెండ్‌కుమార్‌, పెరుమాళ్ల యాదయ్య, ప్రభాకర్‌రెడ్డి, సోమయ్య తదితరులు పాల్గొన్నారు.

#Tags