Telangana Gurukulam: ఐఐటీ, ఎంబీబీఎస్‌, ఎన్‌ఐటీ తదితర ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో లక్ష్యంగా కోచింగ్‌

ఐఐటీ, ఎంబీబీఎస్‌, ఎన్‌ఐటీ తదితర ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో లక్ష్యంగా కోచింగ్‌
ఐఐటీ, ఎంబీబీఎస్‌, ఎన్‌ఐటీ తదితర ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో లక్ష్యంగా కోచింగ్‌

నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి మండలం ధర్మారం(బి) గ్రామంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల/కళాశాల (సీవోఈ) ఐఐటీ, ఎంబీబీఎస్‌, ఎన్‌ఐటీ తదితర ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో సీట్లు సాధించేందుకు విద్యార్థులకు వారధిగా మారింది. ఈ కళాశాలలో ఇంటర్‌ పూర్తిచేసిన విద్యార్థులు ప్రముఖ విద్యాసంస్థల్లో సీట్లు సాధించారు. ఇటీవల ఇంటర్‌ పూర్తి చేసిన బి సింధు కరీంనగర్‌లోని ప్రతిమ కళాశాలలో ఎంబీబీఎస్‌లో, ఏ దివిజ ఐఐటీ ధన్‌బాద్‌లో పెట్రోలియం ఇంజనీరింగ్‌, బి.సాహితీ ఎన్‌ఐటీ ఆంధ్రపదేశ్‌ లో సివిల్‌ ఇంజనీరింగ్‌, జీ.నీహారిక, సీహెచ్‌.సౌందర్య ఎన్‌ఐటీ సూరత్‌ లో ఇంటిగ్రేటెడ్‌ మ్యాథమాటిక్స్‌లో సీట్లు సాదించారు.

Also Read : Telangana Inter Sankranthi Holidays Dates Announced!!

జి. జోత్స్న రాజేంద్రనగర్‌ లోని పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీలో వెటర్నరీ సైన్స్‌, ఎం.సంజన వరంగల్‌ వెటర్నరీ కాలేజీలో వెటర్నరీ సైన్స్‌ అండ్‌ యానిమల్‌ హస్బెండరీ, బి.కీర్తన హార్టికల్చర్‌, పీ.వైష్ణవి జేఎన్‌టీయూ కూకట్‌పల్లిలో ఈసీఈలో సీట్లు సా ధించారు. ఎంసెట్‌ ద్వారా ఇప్పటివరకు పదుల సంఖ్యలో విద్యార్థులు రాష్ట్రంలోని ప్రతిష్టాత్మక ఇంజినీరింగ్‌ కళాశాలల్లో సీట్లు సాధించారు.

#Tags