TS Inter Supplementary Exam Dates 2024 : ఇంట‌ర్ సప్లిమెంటరీ ప‌రీక్ష తేదీలు ఇవే.. అలాగే రీకౌంటింగ్, రివాల్యుషన్ షెడ్యూల్ ఇదే..

సాక్షి ఎడ్యుకేష‌న్‌ : ఎంతో ఉత్కంఠ‌గా ఎద‌రుచూస్తున్న తెలంగాణ ఇంట‌ర్ ఫ‌లితాలు విడుద‌ల చేశారు. అయితే ఈ ఫ‌లితాల‌ల్లో ఇంట‌ర్ విద్యార్థుల‌కు ఏమైనా అనుమానాలు ఉంటే.. రీవాల్యూషన్, రీకౌంటింగ్ చేసుకోవ‌చ్చును. అలాగే ఇంట‌ర్ బోర్డ్ రీవాల్యూషన్, రీకౌంటింగ్ షెడ్యూల్ కూడా విడుద‌ల చేసింది.

అలాగే ఫెయిలైన విద్యార్థులు లేదా మార్కులు తక్కువ వచ్చినట్లు భావించిన విద్యార్థులు ఏప్రిల్ 25వ తేదీ నుంచి మే 02వ తేదీ వరకు రీవాల్యూషన్, రీకౌంటింగ్ కోసం ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. రీకౌంటింగ్ కొరకు 100/-, రీవెరిఫికేషన్ కొరకు రూ.600/- ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

ఇంటర్‌ ఫలితాల 2024 కోసం 👇 క్లిక్‌ చేయండి :

☛ ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

☛ ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ ఒకేషనల్‌ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

☛ ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

☛ ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ ఒకేషనల్‌ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ప‌రీక్ష తేదీలు ఇవే..

తెలంగాణ ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన షెడ్యుల్‌ను కూడా ఇంట‌ర్ బోర్డ్ విడుదల చేసింది. ఏప్రిల్ 25వ తేదీ నుంచి మే 02వ తేదీ వరకు ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజును చెల్లించ‌వ‌చ్చును. మే 24వ తేదీ నుంచి ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు 2024 ను నిర్వహించనున్నారు. ఉదయం ఇంట‌ర్‌ ప్రథమ సంవత్సరం, మధ్యాహ్నం ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నారు.

తెలంగాణ ఇంట‌ర్ ఫ‌లితాలు 2024 ఇలా..

☛ ఫస్ట్‌ ఇయర్‌లో 60.01 శాతం ఉత్తీర్ణత

☛ 2, 87, 261మంది పాసయ్యారు

☛ ఫస్ట్‌ ఇయర్‌లో రంగారెడ్డి జిల్లా టాప్‌, మేడ్చల్ జిల్లా సెకండ్

☛ సెకండ్‌ ఇయర్‌లో 64.61 శాతం

☛ సెకండ్‌ ఇయర్‌లో 3,22,432 మంది పాస్

☛ సెకండ్‌ ఇయర్‌లో ములుగు జిల్లా టాప్‌

☛ ఇవాళ సాయంత్రం నుంచి అందుబాటులోకి మెమోలు

☛ రేపటి నుంచి వచ్చే నెల 2 దాకా రీవ్యాల్యూయేషన్‌, రీ వెరిఫికేషన్‌కు ఛాన్స్‌.. దరఖాస్తు చేస్కోవాలి

☛ మే 24 నుంచి ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌సప్లిమెంటరీ పరీక్షలు

#Tags