TSGENCO AE Jobs 2023 : 339 ఏఈ ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. అర్హ‌త‌లు ఇవే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ(TSGENCO) 339 అసిస్టెంట్ ఇంజినీర్(AE) ఉద్యోగాల భ‌ర్తీకి అక్టోబ‌ర్ 5వ తేదీన‌(గురువారం) నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది.
ts genco ae recruitment 2023

ఈ నోటిఫికేషన్‌ ద్వారా 339 అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులను ప్రత్యక్ష, రెగ్యులర్ నియామకాల పద్ధతిలో భర్తీ చేసేందుకు సంస్థ యాజమాన్యం ఈ మేర‌కు నోటిఫికేషన్‌ జారీ చేసింది. 

అర్హ‌తలు ఇవే..
TSGENCO AE ఉద్యోగాల‌కు సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ద‌రఖాస్తు చేసుకోవ‌చ్చును. 

☛ వయోపరిమితి : 18–44 సంవత్సరాల మద్య ఉండాలి (రిజర్వేషన్ ఆధారంగా సడలింపు కలదు)
☛ దరఖాస్తు ఫీజు : రూ.700/- (SC, ST, BC, EWS, PH లకు రూ.400/-)
☛ ద‌ర‌ఖాస్తు చివ‌రి తేదీ : అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు అక్టోబర్‌ 29వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 

☛ ప‌రీక్ష హల్‌టికెట్ల విడుదల : పరీక్షకు వారం ముందు
☛ TSGENCO AE పరీక్ష తేదీ : డిసెంబర్ 03 –2023
☛ ఎంపిక విధానం : రాత పరీక్ష (100 మార్కులకు) ఆధారంగా
☛ జీతం : 65,600 -1,,31,220

తెలంగాణ‌లో కొత్తగా నిర్మిస్తున్న యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ కేంద్రాల నిర్వహణతో పాటు ఇప్పటికే ఉన్న పాత విద్యుత్ కేంద్రాల అవసరాల కోసం ఈ పోస్టులను భర్తీ చేస్తున్నట్టు TSGENCO ఈ ప్ర‌క‌ట‌న ద్వారా తెలిపింది. 

339 ఏఈ ఉద్యోగాల వివ‌రాలు ఇవే..
☛ ఏఈ(ఎలక్ట్రికల్) పోస్టులు : 187
☛ ఏఈ(మెకానికల్) పోస్టులు : 77
☛ ఏఈ(ఎలక్ట్రానిక్స్) పోస్టులు : 25
☛ ఏఈ(సివిల్) పోస్టులు : 50
 మొత్తం : 339

339 ఏఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివ‌రాలు ఇవే..

#Tags