Jobs: జెన్‌కోలో ఏఈ, కెమిస్ట్‌ పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ (జెన్‌కో)లో 339 అసిస్టెంట్‌ ఇంజనీర్‌ (ఏఈ), 60 కెమిస్ట్‌ పోస్టులను ప్రత్యక్ష నియామకాల పద్ధతిలో భర్తీ చేసేందుకు అక్టోబర్‌ 5న సంస్థ యాజమాన్యం సమగ్ర ప్రకటనలు జారీ చేసింది.
జెన్‌కోలో ఏఈ, కెమిస్ట్‌ పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

 ఈ వివరాలను సంస్థ వెబ్‌సైట్‌ (https://tsgenco.co.in)లో అందుబాటులో ఉంచింది. ఏఈ (ఎలక్ట్రికల్‌) పోస్టులు 187, ఏఈ (మెకానికల్‌) పోస్టులు 77, ఏఈ (ఎలక్ట్రానిక్స్‌) పోస్టులు 25, ఏఈ (సివిల్‌) పోస్టులు 50 కలిపి మొత్తం 339 ఏఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏఈ, కెమిస్టు పోస్టులకు అక్టోబ‌ర్ 7 నుంచి 29 వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తారు. రెండు రకాల పోస్టులకు డిసెంబర్‌ 3న రాతపరీక్ష జరగనుంది.

చదవండి: Free Training: ఎలక్ట్రీషియన్‌ కోర్సులో ఉచిత శిక్షణ

ఎలక్ట్రికల్‌/ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ వి భాగాల్లో ఇంజనీరింగ్‌లో డిగ్రీ కలిగిన వారు ఏఈ (ఎలక్ట్రికల్‌) పోస్టుల కు, సివిల్‌ ఇంజనీరింగ్‌ డిగ్రీ కలిగి ఉన్న వారు ఏఈ (సివిల్‌) పోస్టుల కు, మెకానికల్‌ ఇంజనీరింగ్‌ డిగ్రీ కలి గి ఉన్న వారు ఏఈ (మెకానికల్‌) పోస్టులకు, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌/ఇన్‌స్ట్రూమెంటేషన్‌ కంట్రోల్స్‌ ఇంజనీరింగ్‌/ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కంట్రోల్‌ ఇంజనీరింగ్‌/ఇన్‌స్ట్రూమెంటేషన్‌ అండ్‌ పవర్‌/పవర్‌ ఎలక్ట్రానిక్స్‌ విభాగాల్లో ఇంజనీరింగ్‌ కలిగిన అభ్యర్థులు ఏఈ (ఎలక్ట్రానిక్స్‌) పోస్టుకు అర్హులు. కెమిస్ట్రీ లేదా ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌లో ప్రథమ శ్రేణి ఎంఎస్సీ డిగ్రీ కలిగిన వారు కెమిస్ట్‌ పోస్టులకు అర్హులు అవుతారు.   

#Tags