Young India Police School: ‘ఏప్రిల్‌లో పోలీసు స్కూల్ ప్రారంభం’.. పిల్లలు అడ్మిషన్ విదానం ఇలా!

ఈ మేరకు హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ వివరించారు. మార్చి 21న మంచిరేవుల స్కూల్ ప్రాంగణంలో మొదటి బ్యాచ్ విద్యార్థుల ఎంపిక కోసం లక్కీ డ్రా నిర్వహించారు. ఎంపికైన విద్యార్థుల తల్లిదండ్రులకు అడ్మిషన్ లెటర్లు అందజేశారు.
200 సీట్లకు ఎంపిక ప్రక్రియ
ప్రాథమికంగా ఈ స్కూల్‌లో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు విద్యాబోధన అందించనున్నారు. మొత్తం 200 సీట్లలో 100 సీట్లు పోలీసు సిబ్బంది పిల్లలకు, మిగతా 100 సీట్లు సాధారణ పౌరుల పిల్లలకు కేటాయించారు.
చదవండి: Admissions: తెలంగాణ బీసీ గురుకులాల్లో 6, 7, 8, 9 తరగతుల్లో ప్రవేశాలు.. దరఖాస్తు చివరి తేదీ ఇదే!
విద్యార్థుల ఎంపికను 5 కేటగిరీలుగా విభజించారు:
- అమరవీరుల కుటుంబాలు
- హోంగార్డు నుంచి ఏఎస్సై వరకు
- ఎస్సై నుంచి ఏఎస్పీ వరకు
- ఎస్పీ స్థాయి పై అధికారుల పిల్లలు
- సాధారణ పౌరుల పిల్లలు
లక్కీ డ్రా ద్వారా ఎంపిక
వైఐపీఎస్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా పెద్ద సంఖ్యలో దరఖాస్తులు రావడంతో పారదర్శకత కోసం లక్కీ డ్రా నిర్వహించారు. మార్చి 21న 2, 3, 4 కేటగిరీలకు చెందిన విద్యార్థుల ఎంపిక ప్రక్రియ మంచిరేవుల స్కూల్ ప్రాంగణంలో పూర్తయింది. ఒక్కో క్లాస్‌లో 20 మంది చొప్పున సెలెక్ట్ చేయాల్సి ఉండగా, మొత్తం 45 మంది విద్యార్థులను ఎంపిక చేశారు.
ఎంపికైన విద్యార్థుల సంఖ్య
ఫస్ట్ క్లాస్: 9 మంది
సెకండ్ క్లాస్: 8 మంది
థర్డ్ క్లాస్: 10 మంది
ఫోర్త్ క్లాస్: 10 మంది
ఫిఫ్త్ క్లాస్: 8 మంది
ఈ కార్యక్రమంలో అదనపు డీజీ ఎం. స్టీఫెన్ రవీంద్ర, ఎంపికైన విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. వైఐపీఎస్ ప్రారంభంతో విద్యార్థులకు నూతన అవకాశాలు కల్పించనున్నారు.