Sports Schools: స్పోర్ట్స్‌ స్కూల్‌లో ఏడుగురికి కొత్తగా పోస్టింగ్‌

కైలాస్‌నగర్‌: జిల్లాకేంద్రంలోని స్పోర్ట్స్‌ స్కూ ల్‌లో ఉపాధ్యాయుల డిప్యూటేషన్ల వ్యవహా రంపై కొద్దిరోజులుగా వివాదం కొనసాగుతోంది.

నిబంధనలకు విరుద్ధంగా ఉపాధ్యాయులను డిప్యూటేషన్లపై నియమించారని కొన్ని సంఘాలు ఆందోళన చేపట్టగా, తమకు అనుకూలమైన వారికే పో స్టింగ్‌లు ఇవ్వాలంటూ కొన్ని సంఘాలు ఆందోళన కు దిగాయి. ఈ పరిస్థితిని వివరిస్తూ ‘సాక్షి’లో ప్రచురితమైన కథనాలకు కలెక్టర్‌ రాజర్షిషా స్పందించారు.

చదవండి: Guest Faculty Jobs : గెస్ట్ ఫ్యాక‌ల్టీ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు.. ఇంట‌ర్వ్యూ తేదీ!

ఇదివరకు ఉపాధ్యాయులను డిప్యూటేషన్లపై నియమించగా, ఉపాధ్యాయ సంఘాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం కావడంతోపాటు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీనికి స్పందించిన కలెక్టర్‌ అ ర్హులైన, సామర్థ్యం కలిగిన వారికే పోస్టింగ్‌లు ఇవ్వాలంటూ డీఈవో ప్రణీతను ఆదేశించారు.

కలెక్టర్‌ ఆదేశాల మేరకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించిన ఆమె గురువారం పోస్టింగ్‌లు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో నిబంధనలకు విరుద్ధంగా జారీ చేసిన పోస్టింగ్‌ల్లో ఉన్న ముగ్గురిని తక్షణమే విధులను రిలీవ్‌ చేయాలంటూ ఆదేశించారు. రిలీవ్‌ అయిన సదరు ఉపాధ్యాయులు తమ పాఠశాలల్లో విధుల్లో చేరాలని సూచించారు.

#Tags