Book of Stories: ఉపాధ్యాయుడి ప్రోత్సాహంతో కథల పుస్తకం

నిర్మల్‌ రూరల్‌: సోన్‌ మండలం వెల్మల్‌ బొప్పారం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు చెందిన తెలుగు ఉపాధ్యాయుడు కొండూరి పోతన్న విద్యార్థులకు అన్ని రంగాల్లో వెన్నుదన్నుగా నిలుస్తున్నారు.

ఆయన ఇచ్చిన ప్రోత్సాహంతో గత ఏడాది పాఠశాలలోని పదో తరగతి విద్యార్థులు ఏకంగా కథల పుస్తకం రాశారంటే అతిశయోక్తి కాదు. పాఠశాలకు చెందిన 19 మంది విద్యార్థినులు కలిసి దాదాపు 20 కథలను రాసి, వాటిని పుస్తక రూపంలో ప్రచురించారు.

చదవండి: Alibaba Founder Jack Ma Inspiring Story: ఎగ్జామ్‌లో ఫెయిల్‌.. ఒక్క ఉద్యోగానికి కూడా సెలక్ట్‌ కాలేదు, కానీ ఇప్పుడు ప్రపంచంలోనే కోటీశ్వరుడిగా..

చదువుతోపాటు విద్యార్థులు అన్ని రంగాలలో ముందుండాలని వారిని ప్రోత్సహిస్తున్నారు. పోతన్న సేవలను గుర్తించి 2022లో జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, ఉత్తర వాహిని పురస్కారం, 2021లో ఉగాది పురస్కారం, 2020లో ఝాన్సీ లక్ష్మీబాయి పురస్కారం, రాజశ్రీ పురస్కారం.. ఇలా పదుల సంఖ్యలో పురస్కారాలు ఆయన్ను వరించాయి.

#Tags