Job Mela: రేపే జాబ్‌మేళా..ఈ సర్టిఫికేట్స్‌తో హాజరుకావాలి
వరంగల్ జిల్లాలోని ప్రభుత్వ ఐటీఐ క్యాంపస్‌లో ఈనెల 11న జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఉపాధి కల్పన ఉమ్మడి జిల్లా నోడల్ అధికారి ఎం.మల్లయ్య ఒక ప్రకటనలో తెలిపారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం కోసం ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Government Employees Salary Increase 2024 : గుడ్‌న్యూస్.. ఉద్యోగులకు భారీగా జీతాలు పెంపు..?
హైదరాబాదులోని అపోలో ఫార్మసీలో సుమారుగా 50 ఉద్యోగాల ఎంపికకు ఈ జాబ్ మేళాను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.18 నుంచి 35 ఏళ్ల గల యువతి,యువకులు ఇందుకు అర్హులని పేర్కొన్నారు. ఢీఫార్మసీ,బీఫార్మసీ,ఎంఫార్మసీ, టెన్త్,ఇంటర్ ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైన వారు ఈ జాబ్ మేళాకు హాజరు కావాలన్నారు.
రేపు(ఈనెల 11)న జాబ్ మేళా ఉంటుందని, ఉదయం 11 గంటలకు కార్యక్రమం ప్రారంభం అవుతుందని తెలిపారు. తంలో కూడా వరంగల్ జిల్లాలో పలుచోట్ల అనేక జాబ్ మేళాలు నిర్వహించి ఎంతోమంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగిందని చెప్పారు. అయితే ఈనెల 11న నిర్వహించే ఈ జాబ్ మేళాకు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఆసక్తి గల అభ్యర్థులు ఇందులో పాల్గొనవచ్చన్నారు.
JEE Advanced Results: పెరిగిన జేఈఈ అడ్వాన్స్‌డ్ కటాఫ్.. జనరల్ కేటగిరి ఎన్ని మార్కులంటే..
అభ్యర్థులు తమ స్టడీ సర్టిఫికెట్స్, ఆధార్ కార్డు, పాస్ ఫోటోస్ ఇతర జిరాక్స్ కాపీలతో హాజరుకావాలని సూచించారు. పూర్తి వివరాలకు 8247656356,9848895937 ఫోన్ నెంబర్ లలో సంప్రదించాలని కోరారు.నిరుద్యోగ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.