Kabaddi Player Success Story: కబడ్డీ క్రీడాకారిని.. అర్జునా అవార్డు విజేత.. రీతు నేగి సక్సెస్‌ స్టోరీ!

జీవితంలో ఎన్ని కష్టాలొచ్చిన అనుకున్నది సాధించాలనే పట్టుదల ఉంటే ఎంతటి గమ్యాన్ని అయినా చేరుకోవచ్చు. ఈ క్రీడాకారిని కథ కూడా అటువంటిదే.. తన చదువుకు ఎటువంటి లోటు రాకుండా క్రీడాజీవితంతోపాటు తన చదువును కూడా క్రమంగా సాగించింది..

జనవరీ 9, 2024న అర్జునా అవార్డులను అందుకున్న క్రీడాకారుల‌లో ఒక‌రు భార‌తీయ క‌బ‌డ్డీ క్రీడాకారిని, హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌కు చెందిన రీతూ నేగి, 30 మే 1992లో జన్మించింది. క్రీడాజీవితంలో తన 16 ఏళ్ల తరువాత ఇండియన్‌ వుమెన్స్‌ కబడ్డీ టీం కి కెప్టెన్‌గా వహించింది. 2022లో జ‌రిగిన ఆశియ గేమ్స్‌లో భార‌త జ‌ట్టుకు కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించిన ఈమె 7 అక్టోబ‌ర్ 2023లో జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్‌లో చైనీస్ తైపీ జ‌ట్టును ఓడించి భార‌త జ‌ట్టును గెలిపించింది. రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ముచే అర్జునా అవార్డును ద‌క్కించుకుంది. ఇప్పుడు ఈ క‌థ‌నంతో త‌న విజ‌యగాధ‌ను తెలుసుకుందాం..

Success Story : ఇదే స్ఫూర్తితో ‘గ్రూప్స్‌’ లో ఉద్యోగం సాధిస్తా.. కానీ..

హిమాచల్‌ ప్రదేశ్‌లోని ఒక చిన్న గ్రామంలో నివసిస్తున్న ఒక రైతు కూతురు ఈ క్రీడాకారిని రీతూ నేగి.. ప్రస్తుతం అందుకున్న విజయంతో తన రెండు రాష్ట్రాలకు గర్వకారణంగా నిలిచింది. ఒకటి తన పుట్టిల్లు అయిన హిమాచల్‌తో పాటు తన మెట్టనిల్లైన హర్యానాను కూడా గర్వపడే స్థాయికి ఎదిగింది. హిమాచల్‌లోని గిరిపర్‌ అనే మారుమూల ప్రాంతంలో జన్మించింది. అప్పట్లో వారికి లభించే వసతులు చాలా తక్కువ. చిన్న చిన్న అవసరాలకోసం కూడా గంటలు నడవాల్సిన పరిస్థితి ఉండేది. బస్సుల వసతులు కూడా చాలా పరిమితంగా ఉండేవి. తనది నిరుపేద కుటుంబం అయిన్నప్పటికీ చదువుపై చాలానే కోరిక ఉండేది. తను కష్టపడి తన విద్యా జీవితాన్ని నడిపించింది. కానీ, తనకి చదువుపై ఉన్న ధ్యాసలాగే క్రీడలపై కూడా ఎంతో ఆసక్తి ఉండేది. ఈ కారణంగానే తను క్రీడల్లోకి రావాలనుకుంది. అలా, కబడ్డీపై ఉన్న ఆసక్తితో క్రీడా జీవితాన్ని ప్రారంభించింది. 

Twin Sisters Scored Top Ranks In CA Final Exam- సీఏ పరీక్షల్లో ఆల్‌ఇండియా టాప్‌ ర్యాంకులు సాధించిన అక్కాచెల్లెళ్లు

క్రీడా జీవితం..

రీతు తన క్రీడా జీవితాన్ని ప్రారంభించిన 16 సంవత్సరాల తరువాత ఇండియన్‌ వుమెన్‌ కబడ్డీ టీం కి కెప్టెన్‌గా ఎంపికైంది. మంగళ దెసాయి అనే కోచ్‌ చేత ట్రైనింగ్‌ తీసుకుంది. తన కెప్టెన్సీలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్‌ చైనీస్ తైపీతో తలపడి నెగ్గి బంగారు పతకాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌ అనంతరం 2006లో రీతు బిల్స్‌పూర్‌ స్పోర్ట్‌ హాస్టల్‌కు ఎంపికైంది.

తరువాత రీతు  2011 సంవత్సరంలో మలేష్యాలో జరిగిన ఇండియన్‌ జూనియర్‌ ఆమెన్స్‌ కబడ్డీ టీం కి కెప్టెన్‌గా వ్యవహరించి అండర్‌ 20 కబడ్డీలో బంగారు పతకాన్ని గెలిచింది. ఇలా ఆశియా గెమ్స్‌లో దేశాన్ని గెలిపించిన మొదటి మహిళగా పేరు పొందింది. కానీ, గతంలో జరిగిన ఆశియా గెమ్స్‌లో మూడు పాయిట్ల తేడాతో భారత్‌ కబడ్డీ మ్యాచ్‌ ఓడిపోయింది. అయినప్పటికీ, తన కాతాలో గెలిచిన మ్యాచులే ఎక్కువ ఉన్నాయి. ప్రస్తుతం, జనవరీ 9, 2024న రాష్ట్రపతిచే అర్జునా అవార్డును గెలుచి అందరికీ స్పూర్తిగా నిలిచారు. 

IAS Success Journey : స్మార్ట్‌గా ఆలోచించింది.. ఐఏఎస్ ఆఫీస‌ర్ అయ్యాందిలా.. కానీ మ‌ళ్లీ..

వ్యక్తిగత జీవితం

హరియానాకు చెందిన కబడ్డీ ప్లేయర్‌ రోహిత్‌ గులియాతో తనకు 22 ఏప్రిల్‌, 2022లో వివాహం జరిగింది. తన వివాహం సమయంలో మ్యాచ్‌ ఉండగా కేవలం నాలుగు రోజుల సెలవు మాత్రమే లభించింది. కానీ, కరోనా కారణంగా మ్యాచ్‌ను వాయిదా వేసారు.

Inspire Success Story : క‌ఠిన పేద‌రికం నుంచి వ‌చ్చి.. రూ.1000 కోట్లల‌కు పైగా సంపాదించానిలా.. కానీ..

తన గెలుపుపై రీతు నేగితో..

తను గెలిచిన ప్రతీ మ్యాచ్‌లో తన టీం సహకారం, కుటుంబ సభ్యుల ఆశీసులు, తన కోచ్‌ల ఆశీసులు ఉన్నాయన్నారు. తన కృషి, ఆశయమే తనకు పతకాలను గెలిచే స్పూర్తిని ఇచ్చిందని తెలిపింది. తన ప్రతీ గెలుపుకు టీం ఎప్పుడూ తన వెంటే ఉన్నట్లు చెప్పారు. ఏనాడు తన ఆశలను వదులుకోలేదని, అనుక్షణం పట్టుదలతోనే ఉండేదానినని తెలిపారు.

IPS Officer Success Story : నా కుటుంబం కోసం కాదు.. నా గ్రామం కోస‌మే ఐపీఎస్ ఆఫీస‌ర్ అయ్యా.. కానీ వీళ్లు మాత్రం..

#Tags