Indian Students Deaths In US: అగ్రరాజ్యంలో వరుసగా భారత విద్యార్థులు మృతి.. అస‌లేం జరుగుతోంది..?

అమెరికాలో భారతీయ విద్యార్థుల మరణాలు కలవర పెడుతున్నాయి.

అగ్రరాజ్యంలో ఉన్నత విద్యకు వెళ్లిన విద్యార్థులు వరుసగా మృతి చెందుతున్నారు. ఈ ఏడాది మొదటి నుంచి నలుగురు విద్యార్థులు మృతి చెందడం ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా మరో విద్యార్థి శ్రేయాస్‌రెడ్డి మృతి చెందాడు.  
వివరాల ప్రకారం శ్రేయాస్‌రెడ్డి బెనిగెరి అనే మరో విద్యార్థి ఒహియోలోని సిన్సినాటిలో చనిపోయి కనిపించాడు. అయితే, శ్రేయాస్‌రెడ్డి మరణానికి కారణాలు తెలియాల్సి ఉంది. కాగా, శ్రేయాస్ లిండర్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో చదువుతున్నట్టు తెలుస్తోంది. అతడి మృతిపై న్యూయార్క్‌లోని భారత రాయబార కార్యాలయం ప్రగాఢ సానుభూతి తెలిపింది. బాధిత కుటుంబానికి అవసరమైన సాయం అందిస్తామని పేర్కొంది. మరోవైపు వారం రోజుల వ్యవధిలోనే ఇలా విద్యార్థులు మృతి చెందడం కలవరానికి గురిచేస్తోంది.

#Tags