Good News : ఈ డిసెంబ‌ర్ నెల‌లోనే.. 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తాం ఇలా.. కానీ..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఉద్యోగాల జాత‌ర‌ను కొన‌సాగిస్తుంది. ప్ర‌తి నెల ఏదో ఒక కొత్త నోటిఫికేష‌న్లతో పాటు.. ఉద్యోగ ఫ‌లితాల‌ను ఇస్తున్న విష‌యం తెల్సిందే.

తాజాగా తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు.. ప్రతి నెలా ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అన్నారు. 

☛➤ TGPSC Group 2 Postpone Demand 2024 : గ్రూప్‌-2 వాయిదా వేయాలంటూ...?

నెల‌లోనే 2 లక్షల ఉద్యోగాలకు... :

ఈ డిసెంబ‌ర్ నెల‌లోనే 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు మంత్రి చెప్పారు. పొట్టిశ్రీరాములు యూనివర్సిటీ 39వ వ్యవస్థాపన దినోత్సవాల్లో ఆయన మాట్లాడారు. పరిశ్రమలు తీసుకొచ్చి నిరుద్యోగులకు ఉపాధి అవకాశం కల్పించాలని తమ ప్రభుత్వం ఆరాటపడుతోందన్నారు. ఇతర కార్పొరేషన్ రంగాల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే వివిధ శాఖ‌ల్లో  ఖాళీల‌ను గుర్తించి వెంట‌నే భ‌ర్తీ చేస్తామ‌న్నారు.

#Tags