CISF Constable/ Fire Recruitment 2024: ఇంటర్ అర్హతతో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం.. దరఖాస్తుకు చివరి తేదీ ఇదే

భారత ప్రభుత్వ హోంమంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) దేశ వ్యాప్తంగా కానిస్టేబుల్ పోస్టుల (Constable Jobs) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 1130 పోస్టులను భర్తీ చేయనుంది.
మొత్తం పోస్టులు: 1130
అర్హత: ఇంటర్మీడియట్ లేదా తత్సమాన అర్హత ఉండాలి. అలాగే నిర్దేశిత శారీరక ప్రమాణాలుండాలి. పురుుష అభ్యర్ధులు మాత్రమే అర్హులు.
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు సెప్టెంబర్ 30 నాటికి 23 ఏళ్లు ఉండాలి.
National Space Day 2024: నేడే స్పేస్ డే.. అసలు ఎందుకు జరుపుకుంటారో తెలుసా?
వేతనం: నెలకు రూ.21,700 నుంచి 69,100లతోపాటు ఇతర అలవెన్సులు వర్తిస్తాయి.
ఎంపిక విధానం: ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్/ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు రుసుము: ఓబీసీ, ఇతర అభ్యర్ధులు రూ.100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్ధులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
TGPSC Group-2 Exam schedule Released: గ్రూప్-2 పరీక్షల షెడ్యూల్ విడుదల..
దరఖాస్తులకు ప్రారంభ తేదీ: ఆగస్టు 31, 2024
దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబర్ 30, 2024.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://cisfrectt.in/