RRC Northern Railway Apprenticeship Notification 2024 : రైల్వేలో 4,096 ఖాళీలు.. ద‌ర‌ఖాస్తు చేసుకోండిలా.. !

సాక్షి ఎడ్యుకేష‌న్ : రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ నార్త్‌ రైల్వే ఎన్‌ఆర్‌ పరిధిలోని డివిజన్‌/ వర్క్‌షాప్‌/ యూనిట్లలో యాక్ట్ అప్రెంటిస్‌ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీక‌రిస్తున్నారు.
RRC Northern Railway Apprenticeship Notification 2024 PDF

16.09.2024 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.  పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. మెట్రిక్యులేషన్‌, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.  ద‌ర‌ఖాస్తు ఫీజు  రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ద‌ర‌ఖాస్తు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను ఆగ‌స్టు 16వ తేదీ నుంచి సెప్టెంబ‌ర్ 16వ తేదీలోపు ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. మెరిట్ జాబితాను న‌వంబ‌ర్ నెల‌లో వెల్ల‌డిస్తారు.

ఖాళీల వివరాలు ఇవే :
యాక్ట్ అప్రెంటిస్ : 4,096 ఖాళీలు

ట్రేడ్‌లు : 
మెకానికల్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, కార్పెంటర్, ఎంఎంవీ, ఫోర్జర్ అండ్‌ హీట్ ట్రీటర్, వెల్డర్, పెయింటర్, మెషినిస్ట్, టర్నర్, ట్రిమ్మర్, రిఫ్రిజిరేటర్ అండ్‌ ఏసీ మెకానిక్, డేటా ఎంట్రీ ఆపరేటర్, హామర్ మ్యాన్, టర్నర్, క్రేన్ ఆపరేటర్, స్టెనోగ్రాఫర్ తదితరాలు.

RRC Northern Railway Apprenticeship Notification 2024 Full Details :

#Tags