Indian Railways Jobs 2023 : ఇండియ‌న్ రైల్వేలో 3 లక్షలకు పైగా ఉద్యోగాలు.. ఈ పోస్టుల‌ను ఎప్పుడు భ‌ర్తీ చేస్తారంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఇండియ‌న్‌ రైల్వేలో 3 లక్షలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. రైల్వే నియామకాలపై దాఖలైన సమాచార హక్కు చట్టం పిటిషన్ కు సమాధానంగా ఈ వివరాలు వెల్లడించింది.
RRB Jobs 2023

దాదాపు అన్ని రైల్వే జోన్లలోనూ సిబ్బంది కొరత ఉన్నట్లు పేర్కొంది. ఇందులో గ్రూప్-సి పోస్టుల్లో (క్లర్క్, స్టేషన్ మాస్టర్, టికెట్ కలెక్టర్ మొదలైనవి) 3,11,438 ఖాళీలు ఉన్నట్లు తెలిపింది. మరోవైపు గెజిటెడ్ క్యాడర్ హోదాలో 3,018 ఖాళీలు ఉన్నట్లు పేర్కొంది.

☛ రైల్వేలో టెక్నిక‌ల్ కొలువులకు పరీక్ష విధానం, ప్రిపరేషన్ టిప్స్

ఈ ఏడాది చివ‌రి నాటికి..

దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 21 ఆర్ఆర్బీ ల‌లో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. దాదాపు 3 లక్షల వరకు ఉన్న ఈ ఖాళీలను ఈ సంవత్సరం చివరి నాటికి భర్తీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. 1.5 లక్షలకు పైగా ఖాళీలు గ్రూప్ డి, గ్రూప్ సి కి సంబంధించినవని తెలిపారు. గ్రూప్ డీ లో దాదాపు లక్షకుపైగా ఖాళీలు ఉన్నట్లు తెలిపారు. అలాగే సెంట్రల్ రైల్వే ఈ సంవత్సరం 2 లక్షలకు పైగా పోస్టులను నియమించుకుంటుందన్నారు. ఇందులో గ్రూప్ సీ అండ్ గ్రూప్ డీ పోస్టులు అధికంగా ఉన్నట్లు పేర్కొన్నారు.  

ప్రతి జోన్‌లో 10 వేలకు పైగా ఉద్యోగాలు..

ఈస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్ జోన్‌లు మినహా ప్రతి జోన్‌లో 10 వేలకు పైగా ఖాళీలు ఉన్నాయన్నారు. అంటే సౌత్ సెంట్రల్ రైల్వే పోస్టులు కూడా దాదాపు 10 వేలకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది.  అంతే కాకుండా.. గ్రూప్స్ A, B పోస్టులకు త్వరలో నియామకాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ రిక్రూట్‌మెంట్‌ను యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (UPSC) ద్వారా జరుగుతుందని స్పష్టం చేశారు. 2020 నుంచి రైల్వే శాఖలో గ్రూప్-ఎ, బి పోస్టులకు రిక్రూట్‌మెంట్ జరగని విష‌యం తెల్సిందే.

☛ ఇండియ‌న్‌ రైల్వే గ్రూప్ ‘డి’ ఉద్యోగాల‌కు .ప్రిప‌రేష‌న్ ప్లాన్‌

పారామెడికల్‌, గ్రాడ్యుయేట్‌ ఎన్‌టీపీసీతో కలిపి లక్షా 39 వేల ఖాళీలకు సంబంధించి రిక్రూట్ మెంట్ ప్రాసెస్ కొనసాగుతోంది.  డిసెంబర్ 01, 2022 నాటికి దేశవ్యాప్తంగా ఉన్న 18 జోన్లలోని 3.12 లక్షల నాన్ గెజిటెడ్ గ్రూప్-సి, డి పోస్టులకు భారతీయ రైల్వే సిబ్బంది కొరతను ఎదుర్కొంటోందని జనవరిలో రైల్వే మంత్రి తెలిపిన విష‌యం తెల్సిందే.  

2లక్షలకు పైగా ఉద్యోగాల‌కు..

వీటిలో 2019లో లక్షకు పైగా ఖాళీలతో విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రాసెస్ చివరి దశకు చేరుకుంది. ఆ నియామకాలకు సంబంధించి ఖాళీలను భర్తీ చేసినా.. ఇంకా 2లక్షలకు పైగా ఖాళీలు ఉండే అవకాశం ఉంటుంది. వీటికి సంబంధించి నోటిఫికేషన్లు జూన్ లేదా జులైలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

☛ రైల్వే పరీక్షల‌కు స‌న్నద్ధమ‌వుతున్నారా.. రాణించండిలా!

#Tags