Postal GDS Result Release Date 2024 : 44,228 పోస్టల్ జీడీఎస్ ఉద్యోగాల ఫలితాలు విడుదల ఎప్పుడంటే..?
ఈ ఉద్యోగాలను కేవలం పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ మేరకు మెరిట్ లిస్ట్‌ను రూపొందిస్తారు. 2024 ఏడాదికి సంబంధించిన ఈ ఉద్యోగాల దరఖాస్తుకు గడువు ఆగస్టు 5వ తేదీలో ముగిసింది. ఇక ఫలితాలు ఆగస్టు నెలాఖరు లేదా సెప్టెంబర్ మొదటి వారంలోగా వెల్లడయ్యే అవకాశం ఉంది. ఏవైనా అనివార్య కారణాలు ఎదురైతే ఆలస్యం కావచ్చని అభ్యర్థులు గమనించాలి.
మెరిట్ ఆధారంగా..
టెన్త్ మార్కులు లేదా గ్రేడ్ మెరిట్ ఆధారంగా ప్రకటనలో అభ్యర్థి ఎంపిక చేసుకున్న బ్రాంచీ, హోదా, ప్రాధాన్యం ప్రకారం బట్టి వీటిలో ఏదో ఒకచోట పోస్టింగ్ కేటాయిస్తారు. కంప్యూటర్ ప్రోగ్రామింగ్ సిస్టమ్ జనరేటెడ్ పద్ధతిలో మార్కుల ప్రాధాన్యం రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనుసరించి అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేశారు. ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహించరు. మెరిట్ లిస్ట్ ప్రకారం ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఇండియన్ పోస్టల్ డిపార్ట్‌మెంట్ సమాచారం అందిస్తుంది.
దరఖాస్తులో అభ్యర్థి ఇచ్చిన మొబైల్ నంబర్‌కు ఎస్‌ఎంఎస్, మెయిల్, పోస్టు ద్వారా సమాచారం వస్తుంది. అలాగే https://indiapostgdsonline.gov.in/ అధికారిక వెబ్‌సైట్‌లో ఎంపిక జాబితాను అందుబాటులో ఉంచుతారు. ఫస్ట్ సెలక్షన్ లిస్టులో ఎంపికైన అభ్యర్థులు వివిధ కారణాల వల్ల విధుల్లో చేరకపోతే.. రెండో లిస్టును వెల్లడిస్తారు. రెండో లిస్టులో ఖాళీలు ఏర్పడితే.. మూడో లిస్టులో.. అలాగే దీనిలోనూ చేరకపోతే నాలుగో లిస్టు విడుదలకానుంది.