Andhra Pradesh: సీఎం జ‌గ‌న్ కు చోడ‌వ‌రం ప్ర‌జ‌ల క్షీరాభిషేకాలు, కృత‌జ్ఞ‌త‌లు... కార‌ణం?

చోడ‌వ‌రం అనే గ్రామంలో పాలిటెక్నిక‌ల్ కళాశాల మంజూరు కావ‌డంతో ప్ర‌జ‌లంతా త‌మ సంతోషాన్ని వ్య‌క్తం చేశారు. ఏ ప్ర‌భుత్వం గుర్తించ‌ని త‌మ గ్రామాన్ని వైఎస్ఆర్సీపీ గుర్తించింద‌ని ఇలా త‌మ ఆనందాన్ని వ్య‌క్తం చేశారు..
applauding cm jagan

సాక్షి ఎడ్యుకేష‌న్: మండలంలోని వెంకన్నపాలెంలో ప్రభుత్వ పాలిటెక్నికల్‌ కళాశాల మంజూరు చేయడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం వారు గ్రామంలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ కరణం ధర్మశ్రీ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేసి కృతజ్ఞతలు తెలిపారు. విప్‌ ధర్మశ్రీ ప్రతిపాదన మేరకు చోడవరం గవర్నమెంటు పాలిటెక్నికల్‌ కళాశాలకు సంబంధించి సొంత భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ. 9.80 కోట్లు తాజాగా మంజూరు చేసింది.

DSC Notification 2023: 5089 పోస్టులకు అనుమతి.. పోస్టులు వివ‌రాలు ఇవే

దీని నిర్మాణానికి అవసరమైన ఆరెకరాల స్థలాన్ని చోడవరం మండలం వెంకన్నపాలెంలో సమకూర్చారు. దీంతో ఇక్కడ కాలేజీ భవనాల నిర్మాణం చేపట్టే పనులకు టెండర్ల ప్రక్రియ ప్రారంభమైంది. గతంలో ఏ ప్రభుత్వాలు తమ గ్రామాన్ని గుర్తించలేదని, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం, ఎమ్మెల్యే ధర్మశ్రీ గుర్తించి ఇక్కడ కాలేజీ నిర్మాణానికి చర్యలు తీసుకోవడం ఆనందంగా ఉందని సర్పంచ్‌ మొల్లి ఈశ్వరరావు, వైఎస్సార్‌సీపీ బీసీ సెల్‌ మండల అధ్యక్షుడు మొల్లి సోమునాయుడు తెలిపారు.

Board Exams Twice A Year: ఏటా రెండుసార్లు బోర్డు పరీక్షలు

మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఏడువాక సత్యారావు, మాజీ జెడ్పీటీసీ బొడ్డేడ సూర్యనారాయణ, పార్టీ మండలాధ్యక్షుడు దొడ్డి వెంకట్రావు, స్థానిక నాయకులు నంబారు శ్రీనువాసరావు, జగదీశ్వరరావు, మాజీ ఎంపీటీసీ పిల్లల గోవింద, వార్డు మెంబర్లు, డ్వాక్రా మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
 

#Tags