TS PolyCET 2024 Counselling: వ్యవసాయ వర్సిటీలో ప్రారంభమైన కౌన్సెలింగ్.. చివరి తేదీ ఇదే
ఏజీ వర్సిటీ: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీలో ప్రభుత్వ, ప్రైవేటు వ్యవసాయ, అగ్రి ఇంజినీరంగ్ పాలిటెక్నిక్‌లలో ప్రవేశాలకు జూలై 10న కౌన్సెలింగ్ ప్రారంభమైంది.
ఇందులో పాలిసెట్–2024లో మంచి ర్యాంకులు వచ్చిన విద్యార్థులకు ప్రవేశం కల్పి స్తూ పత్రాలను అందజేశారు. ముందుగా పాలిసెట్–2024లో 455 ర్యాంక్ వచ్చిన అరియా జరీనకు జగిత్యాలలోని వ్యవసాయ పాలిటెక్నిక్‌లో ప్రవేశం ఇచ్చారు.
చదవండి: College Predictor - 2024 (AP & TG EAPCET, POLYCET & ICET)
690 ర్యాంక్ సాధించిన లోకేష్‌కు కంపాసగర్ వ్యవసాయ పాలిటెక్నిక్‌లో ప్రవేశం కల్పించారు. జూలై 12 వరకు మొదటి విడత కౌన్సెలింగ్ జరుగుతుందని అధికారులు తెలిపారు. రిజిస్ట్రార్ రఘురామిరెడ్డి, పాలిటెక్నిక్ డైరెక్టర్ జమునా రాణి, డాక్టర్ శ్రమణ్‌కుమార్ కౌన్సెలింగ్‌లో పాల్గొన్నారు.
#Tags