NCSL Notification 2025 : ఎం.టెక్ ప్రవేశాలకు ఎన్‌సీఎస్ఎమ్ నోటిఫికేషన్.. ముఖ్య వివరాలు..

సాక్షి ఎడ్యుకేషన్: 2025-26 విద్యాసంవత్సరానికి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియంస్ (ఎన్‌సీఎస్ఎమ్) ఎం. టెక్ కోర్సులో ప్రవేశాలు పొందేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులోని వివరాల ప్రకారం, అభ్యర్థులు, తమ విద్యార్హతలు, ఆసక్తి కలిగినవారు ప్రకటించిన విధంగా దరఖాస్తులు పూర్తి చేసుకోవాలి.
కోర్సు వివరాలు: న్యూఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) సహకారంతో కోల్‌కతాలోని ఎన్‌సీఎస్ఎంలో నిర్వహించనున్న 2 ఏళ్ల, 4 సెమిస్టర్ల పూర్తి-సమయ కోర్సు ఇది.
CIPET CAT 2025 Notification : సీఏపీఈటీ క్యాట్ 2025 నోటిఫికేషన్ విడుదల.. అడ్మిషన్ ప్రాసెస్ ఇదే..
అర్హతలు: మ్యూజియాలజీతోపాటు ఏదైనా సబ్జెక్టులో ఎంఎస్సీ పూర్తి చేసి, 55 శాతం మార్కులు (రిజర్వడ్ అభ్యర్థులకు 50శాతం), ఏదైనా సబ్జెక్ట్‌లో బీఈ లేదా బీటెక్, పీహెచ్‌డీ లేదా ఎంటెక్‌లో సైన్స్ లేదా ఇంజినీరింగ్ పూర్తి చేసుండాలి.
ఫెలోషిప్: స్పాన్సర్ చేయని అభ్యర్థులకు నెలకు ₹12,000, కంటింజెన్సీ గ్రాంట్‌తో పాటు.
అడ్మిషన్ ఫీజు: జనరల్/జనరల్-ఈడబ్యూఎస్/ఓబఈసీ వారికి-- రూ. 2000
ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ-ఎన్‌సీఎల్/ పీడబ్యూడీ/ థర్డ్ జెండర్ వారికి-- రూ. 1000
EAPCETతో ఇంజనీరింగ్, అగ్రి, ఫార్మా.. ఉత్తమ ప్రిపరేషన్ టిప్స్!
ఎంపిక ప్రక్రియ: దేశవ్యాప్తంగా నిర్వహించే పరీక్షలో వచ్చిన ఉత్తీర్ణత, ఇంటర్వ్యూతో ఉంటుంది. స్పాన్సర్ చేయబడిన అభ్యర్థులకు పరీక్ష నుండి మినహాయింపు ఉండవచ్చు.
దరఖాస్తుల విధానం: అర్హత, ఆసక్తి ఉన్న విద్యార్థులు www.ncsm.gov.in.లో నుంచి దరఖాస్తులు చేసుకోవాలి.
చివరి తేదీ: ఏప్రిల్ 7, 2025
మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శిస్తూ ఉండండి.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)