Free training youth: నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ ఉపాది అవకాశం కూడా...
కై లాస్‌నగర్: న్యాక్, ఈజీఎంఎం–డీడీయుజీకేవై సంయుక్త ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతకు ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్, ప్లంబింగ్, శానిటేషన్ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఉమ్మడి జిల్లా న్యాక్ కోఆర్డినేటర్ ఎం.నాగేంద్రం ప్రకటనలో తెలిపారు.
పదో తరగతి పాస్, ఫెయిల్ అయి 18 నుంచి 35ఏళ్ల లోపు వారు అర్హులని పేర్కొన్నారు. శిక్షణతో పాటు భోజనం, వసతి సదుపాయం కల్పిస్తామని తెలిపారు. అలాగే బుక్స్, యూనిఫాం, షూ, హెల్మెట్‌తో పాటు ట్రైనింగ్ పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్ సైతం అందిస్తామని పేర్కొన్నారు.
శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ప్రైవేట్ రంగంలో ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. ఈ శిక్షణ తరగతులు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని న్యాక్ వైటీసీ కేంద్రంలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలోని ఆసక్తి గల అభ్యర్థులు 8328507232, 8790414049 నంబర్లలో సంప్రదించాలని కోరారు.