Tamil Actor Vijay : నీట్ పేపర్ లీక్‌ వివాదంపై.. ప్ర‌ముఖ నటుడు విజయ్ ఏమ‌న్నారంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : నీట్‌-2024 పేపర్ లీక్‌ ఘటన ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా గందరగోళం నెల‌కొంది. ఈ నేప‌థ్యంలో నీట్‌-2024 పేపర్ లీక్‌పై ప్రముఖ త‌మిళ‌ నటుడు విజయ్‌ స్పందించారు.

ఈ దేశానికి నీట్‌ అవసరం లేద‌న్నారు. నీట్‌ నుంచి మినహాయింపు ఒక్కటే పరిష్కారం అన్నారు. ఆ పరీక్షకు వ్యతిరేకంగా రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించిన తీర్మానాన్ని స్వాగతిస్తున్నాను అని అన్నారు. 

తమిళనాడు ప్రజల భావోద్వేగాలను గౌరవించాలని కేంద్రాన్ని కోరుతున్నాను. విద్యను ఉమ్మడి జాబితా నుంచి రాష్ట్ర జాబితాకు తీసుకురావాలి. తాత్కాలిక పరిష్కారంగా రాజ్యాంగాన్ని సవరించి ప్రత్యేక ఉమ్మడి జాబితాను తయారుచేయాలి. దానికింద విద్య, ఆరోగ్యాన్ని చేర్చాలి అని నటుడు విజయ్‌ సూచించారు.

#Tags