NEET UG Exam 2024 Updates : నీట్‌ యూజీ రద్దు చేయం.. కార‌ణం ఇదే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : నీట్ యూజీ 2024 పరీక్ష రద్దు చేయాలని దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో కేంద్రం సుప్రీం కోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. ఆ అఫిడవిట్‌లో నీట్‌ పరీక్షను రద్దు చేసే ఆలోచన లేదని తెలిపింది. ఈ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

నీట్‌ పరీక్షను రద్దు చేయడం హేతుబద్ధం కాదని.. ఈ చర్య నిజాయతీ కలిగిన అభ్యర్థుల ప్రయోజనాలను దెబ్బతీస్తుందని స్పష్టం చేసింది. పారదర్శకంగానే పోటీ పరీక్షల నిర్వహణకు కట్టుబడి ఉన్నట్లు తెలిపింది. 

నీట్‌ అక్రమాలపై సీబీఐతో సమగ్ర దర్యాప్తునకు ఆదేశించాన్నారు. భారీ స్థాయిలో అక్రమాలు జరిగినట్లు ఆధారాల్లేవని కేంద్రం తెలిపింది. అలాంటప్పుడు మొత్తం పరీక్షను, ఇప్పటికే ఫలితాలు విడుదలైన ఫలితాలను రద్దు చేయడం సహేతుకం కాదని అఫిడవిట్‌లో పేర్కొంది. అలాగే నీట్‌ను రద్దు చేస్తే.. నిజాయతీగా పరీక్ష రాసిన లక్షల మంది నష్టపోతారని తెలిపింది.

#Tags