NEET-UG Row: నీట్‌ పేపర్‌ లీకేజీ.. ఎన్‌టీఏకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

సాక్షి,న్యూఢిల్లీ : నీట్‌ పేపర్‌ లీకేజీ అంశంలో గురువారం (ఏప్రిల్‌27) సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నీట్‌ పీజీ పరీక్షల్లో ప్రశ్నపత్రం లీకేజీ, ఇతర అక్రమాలు చోటుచేసుకోవడంతో దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ ప్రవేశ పరీక్షలు నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ)పై పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి.

NEET UG 2024 Paper Leak Issues : నీట్ యూజీ 2024 పేపర్ లీకేజీపై.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏమన్నారంటే..

ఈ తరుణంలో విద్యార్ధులు, పలు ఎడ్యుకేషన్‌ సంస్థలు(Xylem Learning) సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాయి. ఓఎంఆర్‌ షీట్‌లో మార్కుల లెక్కింపు అస్పష్టంగా ఉందని పిటిషన్‌లో పేర్కొన్నాయి.

NEET Paper Leak Case: నీట్‌ పేపర్‌ లీకేజీలో కీలక పరిణామం.. నిందితుల్ని అరెస్ట్‌ చేసిన సీబీఐ

అయితే విద్యార్ధులు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు జస్టిస్‌  మనోజ్‌ మిశ్రా,ఎస్‌వీఎన్‌ భట్టీ బెంచ్‌ ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది.ఈ సందర్భంగా జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాల ధర్మాసనం.. విద్యార్ధుల పిటిషన్‌పై ఎన్‌టీఏ వివరణ ఇవ్వాలని సూచించింది. ఆ పిటిషన్‌ను జులై 8న విచారణ చేపడతామని, ఆ లోగా వివరణ ఇవ్వాలని పునరుద్ఘాటించింది.

#Tags