NEET UG Paper Leak Scam Live Updates: నీట్‌లో అక్రమాలు.. ఆ ఆరుగురు టాపర్లకు ఫస్ట్‌ ర్యాంక్‌ లేనట్లే!

న్యూఢిల్లీ: జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష–అండర్‌ గ్రాడ్యుయేట్‌(నీట్‌–యూజీ)లో కొందరు అభ్యర్థులకు కేటాయించిన గ్రేసు మార్కులను రద్దు చేస్తున్నట్లు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) సుప్రీంకోర్టుకు తెలియజేసిన నేపథ్యంలో టాప్‌ ర్యాంకర్లపై ప్రభావం పడబోతోంది. టాపర్లలో కొందరు 60 నుంచి 70 శాతం పాయింట్లు కోల్పోతారని అంచనా. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి ఏకంగా 67 మంది ఫస్ట్‌ ర్యాంకు సాధించిన సంగతి తెలిసిందే. 

వీరిలో గ్రేసు మార్కులతో ఫస్ట్‌ ర్యాంకు పొందినవారు ఆరుగురు ఉన్నారు. గ్రేసు మార్కులను రద్దు చేస్తుండడంతో వీరు ఫస్టు ర్యాంకును కోల్పోనున్నట్లు సమాచారం. అంటే టాపర్ల సంఖ్య 61కి పరిమితం కానుందని అంచనా వేస్తున్నట్లు ఎన్‌టీఏ వర్గాలు వెల్లడించాయి. 

NEET-UG Exam Row: తప్పు జరిగితే ఒప్పుకుని సరిదిద్దుకోండి.. NTA తీరును తప్పుబట్టిన సుప్రీం కోర్టు

నీట్‌–యూజీలో అక్రమాలు జరిగాయని, 1,563 మందికి ఉద్దేశపూర్వకంగా గ్రేసు మార్కులు కేటాయించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో అభ్యర్థుల మార్కులను ఎన్‌టీఏ పునర్‌ మూల్యాంకనం చేస్తోంది. గ్రేసు మార్కులను రద్దు చేసి, మళ్లీ ర్యాంకులు కేటాయించబోతున్నారు. గ్రేసు మార్కులు రద్దయిన వారికి ఈ నెల 23న మళ్లీ పరీక్ష నిర్వహిస్తారు. ఇదిలా ఉండగా, నీట్‌ పరీక్షలో ఎలాంటి అవకతవకలు జరగలేదని ఎన్‌ఏటీ స్పష్టంచేసింది. 

Father and Daughter Clears NEET UG 2024 Exam : ఈ తండ్రి చేసిన ప‌నికి షాక్ అవ్వాల్సిందే.. క‌న్న కూతురి కోసం ఏకంగా..

యథాతథంగా కౌన్సెలింగ్‌!  
నీట్‌ కౌన్సెలింగ్‌ను నిలిపివేయాలని, అక్రమాలపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. షెడ్యూల్‌ ప్రకారం వచ్చేనెల 6వ తేదీ నుంచి జరగాల్సిన కౌన్సిలింగ్‌ నిలిపివేసేందుకు నిరాకరించింది.

#Tags