NEET UG-2024 Scam: నీట్‌ యూజీ ఫలితాలపై కేంద్రం కీలక నిర్ణయం.. ఆ విద్యార్థుల మార్కులపై పునఃసమీక్ష

నీట్‌ యూజీ-2024 ఫలితాలపై వివాదం ముదురుతున్న నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ కీలక నీర్ణయం తీసుకుంది. పరీక్షలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో సమస్యల పరిష్కారానికి నలుగురు సభ్యులతో కూడిన కమిటీ వేయాలని కేంద్రం, నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) నిర్ణయించింది.

ఆ కమిటీ అధ్యయనం అనంతరం, గ్రేస్ మార్కులు పొందిన ఆ 1500 లకు పైగా ఉన్న విద్యార్థుల ఫలితాలను సవరించే అవకాశం ఉందని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. కమిటీ వారంలోగా ప్రభుత్వానికి సిఫార్సులు చేస్తుందని  నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) డైరెక్టర్‌ జనరల్‌ సుబోద్‌కుమార్‌ సింగ్‌ పేర్కొన్నారు. గ్రేసు మార్కులతో అర్హత ప్రమాణాలపై ప్రభావం ఉండదన్నారు.

JEE Advanced Results: పెరిగిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ కటాఫ్‌.. జనరల్‌ కేటగిరి ఎన్ని మార్కులంటే..

కొందరు అభ్యర్థుల ఫలితాలను పునఃసమీక్ష చేయడం వల్ల ప్రవేశాల ప్రక్రియకు ఎలాంటి విఘాతం కలగదని స్పష్టం చేశారు. నీట్‌ పరీక్షలో అవకతవకలు జరగలేదన్నారు. ఎన్సీఈఆర్‌టీ పాఠ్య పుస్తకాల్లో మార్పులు, కొన్ని సెంటర్లలో ఇచి్చన గ్రేసు మార్కుల కారణంగానే అభ్యర్థులకు ఈ ఏడాది ఎక్కువ మార్కులొచ్చాయని వివరించారు. 

ఆరు సెంటర్లలో పరీక్ష నిర్వహణలో జాప్యం జరగడంతో అక్కడ రాసిన విద్యార్థులకు గ్రేసు మార్కులు ఇచ్చారు. మేఘాలయా, హరియాణాలోని బహదూర్‌గఢ్, ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ, బాలోద్, గుజరాత్‌లోని సూరత్‌తోపాటు చండీగఢ్‌లో ఈ పరిణామం చోటుచేసుకుంది. ఈసారి దేశవ్యాప్తంగా 24 లక్షల మంది నీట్‌ రాశారు. ఈ నెల 4న ఫలితాలు వెల్లడయ్యాయి. ఫలితాల వెల్లడి తేదీ దగ్గర్నుంచి ప్రతీది అనుమానాలకు తావిచ్చేలా ఉంది. 

NEET 2024 Results: ‘నీట్‌’పై టెన్షన్‌.. వెల్లడించిన ఫలితాలు ఉంచుతారా? రద్దు చేస్తారా?

గతేడాది దేశవ్యాప్తంగా నీట్‌లో 720కి 720 మార్కులు సాధించిన విద్యార్థులు ఇద్దరు ఉండగా ఈసారి 67 మంది ఉన్నారు. ఇంత మందికి నూరు శాతం మార్కులు రావడంపట్ల కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉత్తరాదిలో ఒక సెంటర్‌లో ఒకే రూమ్‌లో రాసిన విద్యార్థుల్లో పక్కపక్కనే కూర్చున్న వారిలో 8 మందికి 720 మార్కులు రావడంపై విమర్శలు వస్తున్నాయి.

ఇదేమీ  యాదృచ్ఛికం కాదని ఏదో గోల్‌మాల్‌ జరిగిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికేఅనేకమంది విద్యార్థులు, తల్లిదండ్రులు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో ఈసారి నీట్‌ పరీక్షను రద్దు చేస్తారా అనే ఆందోళనలు కూడా విద్యార్థుల్లో నెలకొన్నాయి. 

#Tags