NEET UG 2024 Latest Updates: నీట్-యూజీ పరీక్షపై వివాదం.. అనుమానాలను నివృత్తి చేస్తూ లిస్ట్ రిలీజ్ చేసిన NTA
నేషనల్ ఎంట్రన్స్ కమ్ ఎలిజిబిలిటీ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ (NEET UG 2024) పరీక్ష నిర్వహణలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో NTA పలువురు విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చింది. నీట్ పరీక్షకు సంబంధించి తరచుగా అడిగే ప్రశ్నలు, వాటి సమాధానాల(FAQ) సెట్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది.
అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ exams.nta.ac.in. Inలో చెక్ చేసుకోవచ్చు. కాగా దేశ వ్యాప్తంగా 4,750 కేంద్రాల్లో మే 5న నీట్ పరీక్ష జరగ్గా, ఈనెల 4న ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాల వెల్లడి తేదీ దగ్గర్నుంచి ప్రతీది అనుమానాలకు తావిచ్చేలా ఉంది.
UGC: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఇకపై యూనివర్సిటీల్లొ రెండుసార్లు అడ్మిషన్లు
అత్యంత కఠినమైన ఈ పరీక్షలో ఏకంగా 67 మంది విద్యార్థులు 720 మార్కులకుగాను సరిగ్గా 720 మార్కులు సాధించారు.ఇక పలువురు విద్యార్థులకు ఎన్‌టీఏ గ్రేస్ మార్కులు ఇచ్చిన అంశంపైనా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో NTA తాజాగా FAQ లిస్ట్‌ను రిలీజ్ చేసింది.