NEET UG 2024: ప్రశాంతంగా ముగిసిన నీట్‌ పరీక్ష

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌/ జడ్చర్ల టౌన్‌: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నీట్‌ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఈ మేరకు పరీక్ష మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు కొనసాగింది. అయితే విద్యార్థులను 11 గంటల నుంచే కేంద్రంలోకి అనుమతించారు. లోపలికి అనుమతించే క్రమంలో విద్యార్థినులను క్షుణ్ణంగా పరిశీలించి.. ఆభరణాలు సైతం లేకుండా తొలగించారు.

ఎన్టీఏ సూచించిన నిబంధనల ప్రకారం ఆభరణాలు వెంట తీసుకువెళ్లొద్దని అధికారులు చెప్పారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మొత్తం 11 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా మహబూబ్‌నగర్‌లో 3, జడ్చర్లలో 4, కడ్తాల్‌లో 1, కొత్తకోటలో 1, షాద్‌నగర్‌లో 2 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.

అన్ని పరీక్ష కేంద్రాల్లో 4,920 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకావాల్సి ఉండగా ఇందులో 4,480 మంది హాజరవగా.. 440 మంది గైర్హాజరైనట్లు కోఆర్డినేటర్‌ శ్రీకాంత్‌ కోటా తెలిపారు. వేసవిని దృష్టిలో ఉంచు కుని విద్యార్థులకు పండ్లు, ఓఆర్‌ఎస్‌ పాకెట్లను పంపిణీ చేశారు. కొంతమంది విద్యార్థులు పరీక్ష కేంద్రా ల పేర్లు సరిగా తెలియక ఇబ్బందులు పడ్డారు.

#Tags