NEET PG 2024: నీట్‌ పీజీ స్టేట్‌ ర్యాంకులు విడుదల చేసిన ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ

పీజీ వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీటీ పీజీ ప్రవేశ పరీక్ష-2024 ఫలితాల ఆధారంగా ఆంధ్రప్రదేశ్‌లోని డాక్టర్‌ ఎన్టీఆర్‌ హోల్త్‌ యూనివర్సిటీ స్టేట్‌ ర్యాంకులను ప్రకటించింది. ఈ ఏడాది 2024 - 25 విద్యాసంవత్సరానికి నీట్‌ పీజీ పరీక్షను దేశవ్యాప్తంగా ఆగస్టు 11న రెండు షిప్టుల్లో నిర్వహించారు.

MBBS 2024 Seats: 2023–24లో ఎంబీబీఎస్‌ కన్వినర్‌ కోటా సీట్ల కేటాయింపు

ఎండీ, ఎంఎస్, డీఎన్‌బీ, డిప్లొమా పీజీ కోర్సుల్లో ప్రవేశాలు పొందడానికి జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 50 పర్సంటైల్, జనరల్- పీడబ్ల్యూబీడీ వారికి 45 పర్సంటైల్‌, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూబీడీ వారి 40 పర్సంటైల్ క్వాలిఫైయింగ్‌ మార్కులు కటాఫ్‌గా నిర్ణయించారు.

MBBS 2024 Seats Cut of Ranks: 2023–24లో కాలేజీలవారీగా ఎంబీబీఎస్‌ సీట్ల కటాఫ్‌ ర్యాంకులు విడుదల

మెడికల్‌ పీజీ (ఎండీ/ఎంఎస్‌)లో మొత్తం 8999 మంది అభ్యర్థులు ర్యాంకులు సాధించారు. కౌన్సెలింగ్‌ అనంతరం సీట్లు కేటాయిస్తారు. ఇతర వివరాలు వైఎస్‌ఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

గమనిక: ఇది మెరిట్‌ లిస్ట్‌ కాదు, కేవలం విద్యార్థుల అవగాహన కోసం జాబితాను పొందుపరిచినట్లు యూనివర్సిటీ అధికారులు తెలిపారు. 

#Tags