Free NEET Awareness Classes: నీట్‌ ఉచిత అవగాహన తరగతులు

సాక్షి, హైదరాబాద్‌: నీట్‌–2025కు సన్నద్ధమయ్యే విద్యార్థులకు జూన్‌ 5 నుంచి 9వ తేదీ వరకూ ఉచిత అవగాహన తరగతులు నిర్వహించనున్నట్టు మెటమైండ్‌ అకాడమీ చైర్మన్‌ మనోజ్‌ కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

అయిదు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో ఉచిత హాస్టల్‌ సదుపాయం కూడా ఉంటుందని పేర్కొన్నారు. సీనియర్‌ అధ్యాపకులు, మెడికోలు అవగాహన కల్పిస్తారని, నీట్‌ సాధనలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు మెలకువలు నేర్పుతారని వివరించారు. బైపీసీ చేసిన రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఈ అవకాశం కోసం 9090898902 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.

చదవండి: నీట్ - సక్సెస్ స్టోరీస్ | న్యూస్ | గైడెన్స్ | గెస్ట్ కాలమ్

#Tags