KNRUHS: దసరా తర్వాతే ఎంబీబీఎస్ క్లాసులు!.. ఈ కౌన్సెలింగ్ లేనట్లే..
ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం రాష్ట్రంలో ఆలస్యంగా కౌన్సెలింగ్ మొదలవగా ఇప్పుడు రెండో విడత వెబ్ కౌన్సెలింగ్ నడుస్తోంది. మొత్తం అన్ని కౌన్సెలింగ్‌లు పూర్తయ్యేసరికి ఈ నెలాఖరు వరకు సమయం పట్టవచ్చు. అయితే 15 శాతం జాతీయ కోటా సీట్లు కొన్ని కాలేజీల్లో భర్తీ కావడం, మొదటి కౌన్సెలింగ్‌లో సీట్లు పొందినవారు రిపోర్టు చేయడంతో రాష్ట్రంలో కొన్నిచోట్ల ఓరింటేషన్ తరగతులు ప్రారంభించాలని అనుకున్నారు.
కానీ దసరా పండుగ ఉండటం, ఎక్కువ మంది వచ్చే పరిస్థితి లేకపోవడంతో తరగతులు ప్రారంభం కావట్లేదని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయ వర్గాలు అంటున్నాయి. ఏదిఏమైనా దసరా తర్వాతే తరగతులు మొదలవుతాయని చెబుతున్నాయి.
చదవండి: Government Jobs: వైద్య ఆరోగ్యశాఖలో ఉద్యోగాలు అంటూ ఫోన్‌కాల్స్..
ఐదో విడత కౌన్సెలింగ్, మాప్ అప్ రౌండ్ లేనట్లే!
రాష్ట్రంలో ఇటీవల కన్వీనర్ కోటాకు సంబంధించి తొలివిడత వెబ్ కౌన్సెలింగ్ పూర్తవడం తెలిసిందే. ఆ కౌన్సెలింగ్‌లో 4,282 మందికి కన్వీనర్ కోటా సీట్లు కేటాయించగా వారిలో 11 మందిని మినహాయిస్తే మిగిలిన 4,271 మంది శుక్ర వారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు కేటాయించిన కాలేజీ ల్లో చేరిపోయారు.
ఈ స్థాయిలో చేరడం రికార్డని కాళోజీ వర్సిటీ వర్గాలు పేర్కొన్నాయి. జాతీయస్థాయి కౌన్సెలింగ్‌లు పూర్తవుతుండటం, ఇతర రాష్ట్రాల్లోనూ ఇప్పటికే కౌన్సెలింగ్‌లు జరగడంతో ఎక్కువ మంది విద్యార్థులు చేరినట్లు చెబు తున్నాయి.
తొలివిడత కౌన్సెలింగ్‌లో మిగిలిన 11 సీట్లతో పాటు ఆ కౌన్సెలింగ్‌లో కేటాయించని దివ్యాంగులు తదితర సీట్లు ఇప్పుడు ఉన్నాయి. దీంతో రెండో విడత కౌన్సెలింగ్‌కు మరో 1,344 కన్వీనర్ కోటా సీట్లను భర్తీ చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రెండో విడత వెబ్ కౌన్సెలింగ్‌లో శుక్రవారం ప్రారంభమైంది.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
మొదటి విడతలో కొందరు తమకు వచ్చిన కాలేజీల్లో చేరినప్పటికీ ఇంకా మంచి కాలేజీల కోసం రెండో విడత కౌన్సెలింగ్‌లోనూ పాల్గొంటున్నారు. అలాంటివారు నచ్చిన కాలేజీలో చేరితే మిగిలిన సీట్లలో ఇతరులు చేర నున్నారు. రెండో విడత కౌన్సెలింగ్ తర్వాత కన్వీనర్ కోటా లో ఎక్కువ సీట్లు మిగిలే అవకాశం లేదని కాళోజీ వర్సిటీ వర్గాలు అంటున్నాయి. అందువల్ల ఈసారి ఐదో విడత కౌన్సెలింగ్‌కానీ, మాప్ అప్ రౌండ్‌కానీ ఉండకపోవచ్చని అంటున్నాయి.