NEET 2023 Seat Allotments: MBBS రౌండ్-1 కటాఫ్ ర్యాంకులు ఇవే!

ఎంబీబీఎస్‌ కన్వినర్‌ కోటా మొదటివిడత జాబితాను వర్సిటీ ఆగ‌స్టు 23న‌ వెల్లడించింది. ఏ కాలేజీలో ఎవరికి సీట్లు వచ్చాయో... విద్యార్థులకు సమాచారం పంపించింది. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల్లో ఉన్న కన్వినర్‌ సీట్లలో 4,378 సీట్లు విద్యార్థులకు కేటాయిస్తూ జాబితా విడుదల చేసింది.  

గతేడాది ఓ ప్రైవేట్‌ కాలేజీలో చివరి (నాలుగో) విడత కౌన్సెలింగ్‌లో 2.28 లక్షల ర్యాంకర్‌కు బీసీ–ఏ కేటగిరీలో కన్వినర్‌ సీటు లభించగా, ఈసారి మొదటి విడత కౌన్సెలింగ్‌లోనే 2.38 లక్షల ర్యాంకు సాధించిన ఎస్సీ కేటగిరీ విద్యార్థికి కన్వినర్‌ సీటు లభించడం విశేషం. గతేడాది జనరల్‌ కేటగిరీలో చివరి విడతలో 1.25 లక్షల ర్యాంకుకు సీటు లభించగా, ఇప్పుడు మొదటి విడతలోనే 1.31 లక్షల ర్యాంకుకు జనరల్‌ కేటగిరీలో సీటు వచ్చింది.  

NEET Ranker Success Stories : ఒకే ఇంట్లో ముగ్గురికి మెడికల్‌ సీట్లు.. కార‌ణం ఇదే..

బీసీ– బీ కేటగిరీలో గతేడాది 1.37 లక్షల ర్యాంకుకు సీటు రాగా, ఈసారి మొదటి విడతలోనే 1.40 లక్షల ర్యాంకర్‌కు సీటు వచ్చింది. గతేడాది బీసీ–డీ కేటగిరీలో 1.28 లక్షల ర్యాంకర్‌కు సీటు రాగా, ఈసారి 1.35 లక్షల ర్యాంకర్‌కు సీటు వచ్చింది.  

అన్ని కేటగిరీల్లోనూ గత ఏడాది కంటే ఎక్కువ ర్యాంకు వచ్చిన వారికి కూడా కన్వినర్‌ కోటాలోనే సీట్లు వచ్చాయి. కన్వినర్‌ కోటా సీట్లకు ఇంకా మూడు నుంచి నాలుగు విడతల కౌన్సెలింగ్‌ జరుగుతుంది. మొద టి విడతలో సీటు వచ్చినా, జాతీయస్థాయి కౌన్సెలింగ్‌లో సీటు వచ్చినవారు ఇక్కడ చేరకుంటే, ఆ సీట్లు తదుపరి విడతల్లో కేటాయిస్తారు. అప్పుడు ఇంకా పెద్ద ర్యాంకర్‌కు సీటు వచ్చే అవకాశముంది.

KNRUHS: నీట్‌ ర్యాంకు 2.38 లక్షలు.. ఎంబీబీఎస్‌లో కన్వినర్‌ సీటు.. మొదటివిడత జాబితా ఇదే

Telangana MBBS A Cat Round 1 Cutoffs 2023

      AP/TS UNR 15%
Category
130829 131572 44238 45822
61441 65343    
240555 241630 79081 77837
142259 141956 68663 67313
250387 248359 61354 86193
134104 134105 64873 54579
158439 159307 94911 92188
156900 162095 103120 83861
236078 238964 129163 127747
219742 222470 168973 177664

NEET Counselling 2023:  Round-1 Last Ranks

Category
GEN 478
  131572
EWS 549
  64726
BC-A 393
  241630
BC-B 468
  142259
BC-C 387
  250387
BC-D 475
  134105
BC-E MARK 453
BC-E (MIN) 451
  MARK 162095
SC 394
  MARK 238964
ST 405
  MARK 222470

#Tags