Smartphone Impact On Children: సెల్‌ఫోన్‌ మైకంలో విద్యార్థులు.. చాటింగ్‌ నుంచి వేధింపుల వరకు..

కరీంనగర్‌ క్రైం: కరోనా కారణంగా కాలు బయటపెట్టే వీల్లేకపోవడంతో పిల్లలు ఫోన్‌, కంప్యూటర్లలో ఆటలకు పరిమితమయ్యారు. అవి వారిలో హింసా ప్రవృత్తిని ప్రేరేపించాయి. క్రమంగా బెట్టింగ్‌కు అలవాటు పడేలా చేశాయి. ఇలా రూ.లక్షలు పోగొట్టుకున్నవారు ఉన్నారు. పరువు పోతుందని బయటకు రాని సంఘటలు ఎన్నో. గతంలో బ్లూవేల్‌ ఆటకు అలవాటు పడ్డ పిల్లలు ఆత్మహత్య చేసుకున్న ఘటనలూ ఉన్నాయి.
Smartphone Impact On Children

సోషల్‌ మీడియాతో చేటు

ఈ కాలపు యువత కాలక్షేపం అంతా సోషల్‌ మీడియాలోనే. నేరగాళ్లు వీటి మాటున చెలరేగుతున్నా రు. ఫేస్‌బుక్‌ వేదికగా జరుగుతున్న మోసాలకూ అంతులేదు. అవతలి వ్యక్తి ఎవరో తెలియకుండా మొదలవుతున్న స్నే హం అనర్థాలకు దారితీస్తోంది. అమ్మాయిల ఫొటోలతో చాటింగ్‌ మొదలు పెడుతున్నవారు ఉచ్చు బిగించి, వేధింపులకు పాల్పడుతున్నారు.

మాల్‌వేర్‌ చొరబాటు..

అనేక అంశాలకు సంబంధించిన పుస్తకాలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటున్నాయి. చదవాలనే ఆసక్తితో కొన్నింటిని తెరవగానే కంప్యూటర్లలోకి మాల్‌వేర్‌ చొరబడుతోంది. ఇది కంప్యూటర్‌ కార్యకలాపాలను నేరస్తులకు చేరవేయడమే కాదు.. బ్యాంకు ఖాతాల సమాచారాన్నీ చోరీ చేస్తుంది.

సైబర్‌ స్టాకింగ్‌..

ఆన్‌లైన్లో మారుపేరుతో స్నేహం చేస్తూ.. మహిళలను లైంగికంగా వేధించడమే సైబర్‌ స్టాకింగ్‌. ఈ తరహా నేరగాళ్లు మహిళల ఫోన్‌ నంబర్లు, ఈ–మెయిల్‌ ఐడీలు సేకరించి, ఇబ్బంది పెడతారు. విద్యార్థినులు, ఉద్యోగినులు దీని బారిన పడుతున్నారు.

Half Day for Schools: ఒక్క పూటే ప్రాథమిక పాఠశాలలు.. కార‌ణం ఇదే..

సైబర్‌ టీజింగ్‌..

సూటిపోటి మాటలతో వేధించడం టీజింగ్‌. అదే ఆన్‌లైన్లో చేస్తే సైబర్‌ టీజింగ్‌. అనేక మంది ఇప్పుడు ఆన్‌లైన్లో దీన్నే ఫాలో అవుతున్నారు. ముఖ్యంగా అమ్మాయిలను రకరకాలుగా వేధిస్తున్నారు. తల్లిదండ్రులకు చెబితే ఏమనుకుంటారో అనే భయంతో వారు తమలో తామే కుమిలిపోతుంటారు.

క్యాట్‌ ఫిషింగ్‌..

మారుపేరుతో మోసానికి పాల్పడటం క్యాట్‌ ఫిషింగ్‌. ఈ తరహా నేరగాళ్లు మారుపేర్లు, ఫొటోలతో ఆన్‌లైన్‌ ప్రొఫైల్స్‌ పెట్టుకుంటారు. సామాజిక మాధ్యమాల ద్వారా కొంతకాలం స్నేహితులుగా నటిస్తారు. తర్వాత తమకు ప్రమాదం జరిగి ందని, ఇంట్లో వాళ్లకు తీవ్ర అనారోగ్యం వచ్చిందని డబ్బు గుంజేందుకు ప్రయత్నిస్తుంటారు.

డాక్సింగ్‌..

ప్రముఖ వ్యక్తులు, సంస్థలను రకరకాలుగా వేధించడమే డాక్సింగ్‌. సంస్థలు, వ్యక్తుల కంప్యూటర్లలోకి చాటుగా చొరబడుతున్న నిందితులు కీలక సమాచారం తస్కరిస్తున్నారు. దాన్ని అంతర్జాలంలో పెడుతూ పరువు తీస్తున్నారు. అడిగినంత డబ్బు చెల్లించకపోతే ఇంకా ముఖ్యమైన సమాచారం బహిర్గతం చేస్తామని బెదిరిస్తారు.

Summative Exams: ఈనెల 6 నుంచి ప్రారంభం కానున్న సమ్మేటివ్‌ పరీక్షలు

సైబర్‌ బుల్లీయింగ్‌..

60 శాతం మంది యువ త సైబర్‌ బుల్లీయింగ్‌ బారిన పడుతున్నారు. ఎదుటివారిని మానసికంగా దెబ్బతీ సేలా పోస్టులు పెడుతూ ఇబ్బంది పెడతారు.

 స్వాటింగ్‌..

ఫలానా వ్యక్తి సంఘ విద్రోహశక్తి. అతని దగ్గర మారణాయుధాలో, మాదకద్రవ్యాలో ఉన్నాయని పోలీసులకు సమాచారమిచ్చి, ఇబ్బందులకు గురిచేయడమే స్వాటింగ్‌. గిట్టనివారిని లక్ష్యంగా చేసుకునే నేరమిది.

వీడియో చాట్‌తో మోసం

రకరకాల పద్ధతుల్లో ఫోన్‌ నంబర్లు సేకరిస్తున్న నేరగాళ్లు అందమైన అమ్మాయిలతో మాట్లాడిస్తున్నారు. కొద్దిగా పరిచ యం కాగానే వీడియోకాల్‌లో చాటింగ్‌ చేద్దామని ముగ్గులోకి దింపుతారు. అందుకు సిద్ధమవగానే రెచ్చగొట్టేందుకు వీడియో కెమెరా ముందే నగ్నంగా మారిపోతారు. మాటలతో మభ్యపెట్టి, ఎదుటివారినీ నగ్నంగా మారాలంటూ కవ్విస్తారు. లొంగిపోతే.. ఇక అయిపోయినట్లే. ఆ వ్యవహారమంతా రికార్డు చేస్తారు. సంబంధిత ఫొటోలు, వీడియోలు బయట పెడతామంటూ బెదిరించి, డబ్బు గుంజుతారు.

#Tags