Impact Of Mobile Phones On Children: చిన్నారులకు స్మార్ట్‌ఫోన్లు ఇస్తున్నారా? మెదడుపై విపరీతంగా ప్రభావం..

సాక్షి, అమరావతి: స్మార్ట్‌ ఫోన్, టాబ్లెట్‌ వాడకం చిన్నారుల్లో ప్రతికూల భావోద్వేగాలను పెంచుతోందని శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఎల్రక్టానిక్‌ పరికరాలు వాడే ప్రీ స్కూల్‌ చిన్నారుల్లో చిరాకు, కోపం ఎక్కువగా కనిపిస్తోందని గుర్తించారు. కెనడా లోని షెర్‌బ్రూక్‌ యూనివర్సిటీ పరిశోధన ప్రకారం.. స్మార్ట్‌ ఫోన్‌ వాడకం చిన్నారుల్లో స్వీయ నియంత్రణ, నైపుణ్యాల అభివృద్ధికి అవరోధం ఏర్పడుతోంది. 

మూడున్నరేళ్లు, నాలుగున్నరేళ్ల వయసు నుంచి టాబ్లెట్‌కు అలవాటుపడ్డ చిన్నారుల భావోద్వేగాలను పరిశీలించారు. ఇలాంటి చిన్నారుల్లో ఏడాది తర్వాత కోపం, నిరాశ విపరీతంగా పెరిగినట్టు గుర్తించారు. చిన్నారులు సొంత ప్రతికూల భావోద్వేగాలను నేర్చుకునే విధానం సాంకేతిక పరికరాల ద్వారా జరుగుతుండటం శ్రేయస్కరం కాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

TG ICET Counselling 2024: తెలంగాణ ఐసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల

సాధారణంగా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సంరక్షకుల పర్యవేక్షణలో బాల్య వికాసం జరిగితేనే.. సరైన భావోద్వేగం ప్రదర్శిస్తారని చెబుతున్నారు. ప్రతి ఇంట్లో చిన్నారుల అల్లరిని కట్టడి చేసేందుకు, ఏడుపును అదుపు చేసేందుకు స్మార్ట్‌ ఫోన్‌ అలవాటు చేయడం సరైన పద్ధతి కాదని అధ్యయనం చెబుతోంది. ఇది బాల్యం, యుక్తవయసులో చిన్నారుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తోందంటున్నారు.  

యునిసెఫ్‌ సైతం 
యునిసెఫ్‌ సైతం చిన్నారుల స్క్రీనింగ్‌ అలవాట్లను తీవ్రంగా తప్పు­పడుతోంది. ఏడాది కంటే తక్కువ వయసున్న పిల్లలు ఎటువంటి సాంకేతిక పరికరాల నుంచి ఏమీ నేర్చుకోలేరని చెబుతోంది. వారికి స్మార్ట్‌ ఫోన్లు, ట్యాబ్‌లు చూపించడం ద్వారా మెదడుపై ప్రతికూల ప్రభావం గురించి యు­ని­సెఫ్‌ వైద్య బృందం సైతం హె­చ్చరిస్తోంది. ఆఫ్‌–్రస్కీన్‌ అను­భ­వాలను అందించడం ద్వారా క్లిష్టమైన వాటిని కూడా చిన్నారులు నేర్చుకోవడంతో పాటు సామాజిక, అభిజ్ఞా నైపుణ్యాలు మెరుగుపడతాయని చెబుతు­న్నారు. 

NEET UG counselling 2024: నీట్‌ యూజీ-2024 తొలి రౌండ్‌ కౌన్సెలింగ్‌ ఫలితాలు విడుదల

చి­న్నారుల్లో మెదడు బాహ్య ప్రపంచం నుంచి గ్రహించిన వాటితోనే అభివృద్ధి చెందుతుందని, కథలు వినడం, పుస్తకాలను బిగ్గరగా చదవడం, చిత్రా­లను గుర్తించడం ద్వారా ప్రేరణ పెరుగుతోందని వైద్యులు నిపు­ణు­లు సూచిస్తున్నారు. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ రెండేళ్ల కంటే తక్కువ వయసున్న పిల్ల­లకు స్క్రీన్‌ సమయం ఇవ్వకూడదని, నాలుగేళ్ల లోపు చిన్నారులకు పాఠ్యాంశాల పరమైన వాటి­కి, గంటలోపు మాత్రమే స్క్రీనింగ్‌కు కేటాయించాలని సూచిస్తోంది. తాజా పరిశోధనలో 75 నిమిషాలు, అంతకంటే ఎక్కువ రోజువారీ స్క్రీన్‌ సమయం ఉండటం గమనార్హం.  

స్క్రీనింగ్‌తో అనారోగ్యం 
మన ఫోన్లు, టీవీలు, కంప్యూటర్‌ల స్క్రీన్లు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. స్క్రీన్‌ సమయంలో కదలకుండా ఒకేచోట కూర్చోవడంతో బరువు పెరగడం, ఊబకాయం సమస్యలు తలెత్తున్నాయి. ఇది యుక్త వయసు వచ్చేసరికి మధుమేహం, గుండె జబ్బులు, క్యాన్సర్, చిత్త వైకల్యానికి దారితీస్తున్నాయి. మానసిక ఆరోగ్య సమస్యలతో పాటు మాట్లాడే పదాలను తక్కువగా నేర్చుకోవడంతో పాటు డిప్రెషన్‌ ప్రమాదాన్ని మూడు రెట్లు పెంచుతాయని అధ్యయనంలో పాల్గొన్న వైద్యులు చెబుతున్నారు.  

#Tags