Job Mela 2024: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రముఖ బ్యాంకుల్లో మేనేజర్ పోస్టులు
ఆసిఫాబాద్‌అర్బన్: ప్రముఖ కంపెనీల్లో పని చేసేందుకు ఈనెల 19వ తేదీన నిర్వహించనున్న జాబ్‌మేళాను జిల్లాలోని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పనాధికారి రవికృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు.
ఉపాధి కల్పనశాఖ ఆధ్వర్యంలో టాస్క్, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల సహకారంతో కాగజ్‌నగర్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.50 ఐసీఐసీఐ బ్యాంక్‌లో రిలేషన్‌షిప్ మేనేజర్ పోస్టులు, 50 యాస్ బ్యాంక్‌లో రిలేషన్‌షిప్ మేనేజర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. ఏదైనా డిగ్రీ కలిగి, 28 ఏళ్లలోపువారు హాజరు కావాలని పేర్కొన్నారు.
Vacancies In High Courts: హైకోర్టుల్లో 331 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీ
వేతనం రూ.18 వేల నుంచి రూ.20 వేల వరకు ఉంటుందని, ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 19న ఉదయం 11గంటలకు జరిగే జాబ్‌మేళాకు విద్యార్హతల సర్టిఫికెట్లు, బయోడేటా తో హాజరు కావాలని తెలిపారు. పూర్తి వివరాలకు 9908187894, 9440514962 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.