Navodaya Vidyalaya Admissions : నవోదయ విద్యాలయాల్లో దరఖాస్తులకు నోటిఫికేషన్‌.. సీటు వస్తే ఏడేళ్ల పాటు ఉచితంగా విద్యాబోధన

ఎమ్మిగనూరురూరల్‌: విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతూ.. ఉత్తమ విద్యా బోధన అందిస్తూ ఎమ్మిగనూరు సమీపంలోని బనవాసి జవహర్‌ నవోదయ విద్యాలయం పేరుగాంచింది. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కార్పొరేట్‌ స్థాయి విద్యనందించేందుకు 1986లో దీనిని స్థాపించారు. ఈ విద్యాలయంలో సీటు వచ్చిందంటే చాలు తమ బిడ్డ భవిత బంగారమేనని తల్లిదండ్రులు భావిస్తున్నారు.

నవోదయ విద్యాలయంలో 2025–2026 విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశానికి సంబంధించిన ప్రవేశ పరీక్ష ప్రకటన విడుదలైంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు 2025 జనవరి 18న ప్రవేశ పరీక్ష ఉంటుంది. సెప్టెంబర్‌ 16వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

బనవాసి జవహర్‌ నవోదయ విద్యాలయంలో 80 సీట్లు అందుబాటులో ఉండగా బాలికలకు 30 శాతం సీట్లు, ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం, దివ్యాంగులకు 3 శాతం సీట్లు కేటాయిస్తున్నారు. మొత్తం 80 సీట్లలో 75 శాతం అంటే 60 సీట్లను గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు, 20 సీట్లు పట్టణ ప్రాంతాల విద్యార్థులకు కేటాయిస్తారు.

IT Sector: ఐటీ రంగం పుంజుకోదా..? ఎకనామిక్‌ సర్వే ఏం చెప్పిందంటే..

అంతా ఉచితమే..
నవోదయ విద్యాలయంలో ప్రవేశం పొందిన విద్యార్థులకు అన్ని సౌకర్యాలు ఉచితమే. అరు నుంచి 12వ తరగతి వరకు ఏడు సంవత్సరాల పాటు అత్యుత్తమ విద్య అందిస్తారు. భోజనం, వసతి, యూనిఫాం, బూట్లు, పుస్తుకాలను అందిస్తారు. విద్యార్థుల భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఆరోగ్య పర్యవేక్షణ కోసం స్టాఫ్‌ నర్స్‌ అందుబాటులో ఉంటారు. స్థానిక పీహెచ్‌సీ వైద్యాధికారి ఆధ్వర్యంలో విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.

అత్యుత్తమ విద్యా ప్రమాణాలు
నవోదయ విద్యాలయంలో సీబీఎస్‌ఈతో కూడిన అత్యుత్తమ విద్యా బోధన అందిస్తారు. నిపుణులైన అధ్యాపకలు బోధిస్తారు. సువిశాల ప్రాంగణం, ఆహ్లాదకర వాతావరణం, అధునాత కంప్యూటర్‌ ల్యాబ్‌, పోషక విలువలతో కూడిన ఆహారం, మానసికోల్లాసానికి క్రీ డలు, సాంస్కృతిక కార్యక్రమాలు, యోగా, ఎన్‌సీసీ తదితర అంశాలు నవోదయ విద్యాలయ ప్రత్యేకతలు. సీబీఎస్‌ఈ పరీక్ష ఫలితాల్లో నూరు శాతం ఉత్తీర్ణత సాధిస్తూ నవోదయాలు తమ ప్రత్యేకతను చాటుకుంటున్నాయి.

విశాల గంథ్రాలయం
బనవాసి నవోదయ విద్యాలయంలో విద్యార్థుల సౌకర్యార్థం సైన్స్‌, గణితం, సాహిత్యం తదితర అంశాలకు సబంధించిన పుస్తకాలను గ్రంథాలయంలో అందుబాటులో ఉంచారు. అలాగే సమకాలీన వార్తాంశాలపై అవగాహన కోసం పలు తెలుగు, ఆంగ్ల ప్రతికలను విద్యార్థులకు అందుబాటులో ఉంచుతున్నారు. గంథ్రాలయంలో విద్యార్థు తమ జ్ఞానాన్ని పెంపొందించుకుంటారు. విద్యార్థులకు అత్యుత్తమ విద్యా బోధన చేసేందుకు శాంసంగ్‌ స్మార్ట్‌ క్లాస్‌ రూం ఏర్పాటు చేశారు. ల్యాప్‌ ట్యా ప్‌లు, టాబ్‌లను విద్యార్థులకు అందుబాటులో ఉంచి వేగవంతమైన అంతర్జాల సౌకర్యం కల్పించా రు. డిజిటల్‌ క్లాస్‌ రూమ్స్‌లో నిపుణులైన అధ్యాపకులతో విద్యాబోధన అందిస్తున్నారు.

RGUKT- idupulapaya Campus admissions 2024: నేటి నుంచి ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీలో అడ్మిషన్ల ప్రక్రియ

ఆటలు...సాంస్కృతిక కార్యక్రమాలు
నవోదయ విద్యాలయంలో 37 ఎకరాల్లో సువిశాల క్రీడా ప్రాంగణం ఉంది. బనవాసి నవోదయ విద్యార్థులు రీజనల్‌, జాతీయ స్థాయి క్రీడల్లో రాణిస్తున్నారు. క్రమశిక్షణ, విలువలు పెంపొందించేందుకు ఎన్‌సీసీ, నేషనల్‌ గ్రీన్‌ కోర్‌, స్కాట్స్‌ తదితర అంశాల్లో శిక్షణ ఇస్తున్నారు. ఆసక్తి కలిగిన విద్యార్థులకు సంగీతం, నృత్యం, చిత్రలేఖనం తదితర అంశాల్లోనూ శిక్షణ అందిస్తున్నారు.

గ్రామీణ విద్యార్థులకు సువర్ణ అవకాశం
గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఇది సువర్ణ అవకాశం. విద్యాలయంలో అత్యుత్తమ విద్యాప్రమాణాల సాధన లక్ష్యంగా పటిష్ట విద్యా ప్రణాళికలు అమలు చేస్తున్నాం. విద్యార్థులు సర్వోతోముఖాభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా మానసిక నిపుణలతో కౌన్సెలింగ్‌ ఇప్పిస్తున్నాం. వారి ఉజ్వల భవిష్యుత్తు కోసం కేరీర్‌ గైడెన్స్‌ సెల్‌ ఏర్పాటు చేశాం. పోషక విలువలతో కూడిన ఆహారం అందిస్తున్నాం. ఇక్కడ చదువుకున్న విద్యార్థులు చాలా మంది ఉన్నత స్థాయిలో ఉన్నారు.
– ఇ. పద్మావతి, ప్రిన్సిపాల్‌, బనవాసి నవోదయ

 

#Tags