NTA: JEE Main 2025 సెషన్-2: పరీక్షా నగరాలు కేటాయింపు.. ఇలా చేసుకోండి!

జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ - 2025 సెషన్-2 పరీక్షకు దరఖాస్తు చేసిన అభ్యర్థులకు పరీక్షా నగరాలు కేటాయింపు ముందస్తు సమాచారం (Advance Intimation of Examination City) విడుదలైంది.

జాతీయ పరీక్షా మండలి (NTA) అధికారిక వెబ్‌సైట్‌ jeemain.nta.ac.in ద్వారా అభ్యర్థులు తమ పరీక్షా నగరాన్ని తెలుసుకోవచ్చు. ఏప్రిల్ 2, 3, 4, 7, 8, 9 తేదీలలో పరీక్షలు జరగనున్నాయి. సమస్యలు ఉంటే NTA హెల్ప్‌లైన్‌ నంబర్: 011-40759000 / 011-69227700కి కాల్ చేసి సమస్యలు పరిష్కరించుకోవచ్చు.

చదవండి: జేఈఈ (మెయిన్స్‌ & అడ్వాన్స్‌డ్‌) - గైడెన్స్ | వీడియోస్

పరీక్షా నగరాలు సమాచారం ఎలా చెక్‌ చేయాలి?

  • అధికారిక వెబ్‌సైట్‌ jeemain.nta.ac.in కు లాగిన్‌ అవ్వండి.
  • “Advance Intimation of Examination City” లింక్‌పై క్లిక్ చేయండి.
  • మీ అప్లికేషన్ నంబర్, జన్మతేది ఎంటర్ చేసి సబ్‌మిట్ చేయండి.
  • పరీక్ష నిర్వహించే నగర సమాచారం స్క్రీన్‌పై చూపబడుతుంది.

అభ్యర్థులకు సూచనలు:

  • పరీక్ష నగరం కేటాయింపు సమాచారం అడ్మిట్ కార్డు కాదని గమనించాలి.
  • అడ్మిట్ కార్డు విడుదలకు ముందు అభ్యర్థులు తమ పరీక్ష నగరాన్ని ముందుగా తెలుసుకునే అవకాశం ఉంటుంది.
  • పరీక్ష కేంద్రాన్ని సరిగా చూసుకుని ముందస్తు ప్రణాళికలు చేసుకోవడం వల్ల పరీక్ష రోజు అనవసరమైన సమస్యలు తప్పించుకోవచ్చు.
Join our WhatsApp Channel: Click Here
 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
#Tags