JEE Main 2025: జేఈఈ మెయిన్‌లో ఛాయిస్‌ ఎత్తివేత

జేఈఈ మెయిన్‌ పరీక్షల్లో గత మూడేళ్ల నుంచి సెక్షన్‌ బీలో కొనసాగుతున్న ఛాయిస్‌ను ఎత్తివేశారు. ఈ మేరకు జాతీయ పరీక్షల సంస్థ(ఎన్‌టీఏ) గురువారం రాత్రి నోటిఫికేషన్‌ జారీ చేసింది.

జేఈఈ మెయిన్‌ ర్యాంకుల ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 32 ఎన్‌ఐటీల్లో బీటెక్‌ సీట్లు భర్తీ చేస్తారు.  జేఈఈ మెయిన్‌లో 75 ప్రశ్నలు...ఒక్కో దానికి 4 మార్కుల చొప్పున మొత్తం 300 మార్కులకు ప్రశ్నపత్రం ఇచ్చేవారు. గణితం, భౌతిక, రసాయనశాస్త్రాల నుంచి 25 చొప్పున ప్రశ్నలు ఉండేవి. 

JEE Mains and Advanced : జేఈఈ మెయిన్స్‌, అడ్వాన్స్‌డ్ ఫ‌లితాల‌తోనే ఈ కోర్సుల్లో ప్ర‌వేశానికి అవ‌కాశం.. త్వ‌ర‌లోనే..

కొవిడ్‌ నేపథ్యంలో విద్యార్థులకు వెసులుబాటు ఇచ్చేందుకు ప్రతి సబ్జెక్టులో ఛాయిస్‌ ప్రశ్నలు ఇచ్చారు. జేఈఈ మెయిన్‌ 2021 నుంచి ఒక్కో సబ్జెక్టులో 30 చొప్పున మొత్తం 90 ప్రశ్నలు ఇస్తూ వచ్చారు. ప్రతి సబ్జెక్టులో ఏ, బీ సెక్షన్లు ఉండేవి. సెక్షన్‌ ఏలో 20 ప్రశ్నలకు మొత్తం జవాబులు రాయాలి. సెక్షన్‌ బీలో 10 ఇచ్చి అయిదు ప్రశ్నలకు సమాధానాలు గుర్తించేలా ఛాయిస్‌ ఇస్తున్నారు. ఈసారి నుంచి ఆ ఛాయిస్‌ను విరమించుకుంటున్నట్లు ఎన్‌టీఏ ప్రకటించింది.

#Tags