How To Apply JEE Advanced Registration: జేఈఈ అడ్వాన్స్‌డ్‌-2024కు ఎలా అప్లై చేయాలి? చివరి తేదీ ఎప్పుడంటే..

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2024 రిజిస్ట్రేషన్లు ప్రారంభమయిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షను ఐఐటీ మద్రాస్‌ నిర్వహించనున్నది. ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో బీటెక్‌, ఆర్కిటెక్చర్‌ కోర్సుల్లో ప్రవేశాలకు  జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షను నిర్వహిస్తారు.

జేఈఈ మెయిన్స్‌లో కటాఫ్‌ మార్కులు పొంది ఉత్తీర్ణత సాధించిన 2.50 లక్షల మంది అభ్యర్థులకి జేఈఈ అడ్వాన్స్‌డ్‌ (JEE Advanced 2024) పరీక్ష రాసేందుకు అవకాశం ఉంటుంది.అభ్య‌ర్థులు జేఈఈ అధికారిక సైట్ jeeadv.ac.in నుండి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు.    

దరఖాస్తుకు చివరి తేదీ ఎప్పుడంటే..
ఈ పరీక్షకు ఏప్రిల్‌ 27 నుంచే దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. మే 7వతేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. కటించిన షెడ్యూలు ప్రకరం మే 26న జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష నిర్వహించనున్నారు.

JEE Mains 1st Ranker Nilkrishna Success Story : అదో మారుమూల గ్రామం.. ఓ సాధార‌ణ రైతు బిడ్డ.. నెం-1 ర్యాంక్ కొట్టాడిలా.. కానీ..

 

ఆరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1 పరీక్ష; మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2 పరీక్ష నిర్వహించనున్నారు. జేఈఈ అడ్వాన్స్‌డ్  పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను (JEE Advanced 2024 Admit Card) మే 17 నుంచి అందుబాటులో ఉండనున్నాయి.

JEE Advanced 2024కి ఇలా అప్లై చేయండి

  • ముందుగా అభ్యర్థులు jeeadv.ac.in అధికారిక వెబ్‌సైట్‌ను క్లిక్‌ చేయండి.
  • ఆ తర్వాత హోంపేజీలో కనిపిస్తున్న జేఈఈ అడ్వాన్స్​డ్​ 2024' అని కనిపిస్తున్న లింక్‌పై క్లిక్‌ చేయాలి. 
  •  రిజిస్ట్రేషన్ వివరాలు ఎంటర్ చేసి సబ్‌మిట్‌ బటన్‌పై క్లిక్‌ చేయండి. 
  • అనంతరం అప్లికేషన్‌ ఫీజు కూడా చెల్లించి సబ్‌మిట్‌పై క్లిక్‌ చేస్తే సరి. 
  • అప్లికేషన్‌ ఫారమ్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోండి. 

#Tags