Download JAM Hall Ticket 2025 : జామ్ హాల్‌టికెట్‌ను ఈ విధంగా డౌన్‌టోడ్ చేసుకోండి.. ఫ‌లితాల తేదీ ఇదే..

జామ్ ప‌రీక్ష‌కు సంబంధించిన హాల్‌టికెట్ల‌ను అధికారులు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో పెట్టారు. ఈ నేప‌థ్యంలో ద‌ర‌ఖాస్తులు చేసుకున్న అభ్య‌ర్థులు డౌన్‌లోడ్ ప్రాసెస్‌ను తెలుసుకొని, ప్రింట్ తీసుకొండి..

సాక్షి ఎడ్యుకేష‌న్: విద్యార్థులు ఉన్న‌త విద్య కోసం ప్రముఖ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), ఢిల్లీలో సీటు పొందేందుకు రాయాల్సిన ప్ర‌వేశ ప‌రీక్ష‌ ఐఐటీ జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్ (జామ్‌) ఈ ప‌రీక్ష‌కు సంబంధించి, హాల్‌టికెట్‌ల‌ను ఇటీవ‌లె విడుద‌ల చేశారు. ఈ ప‌రీక్ష‌ను రాసేందుకు ద‌ర‌ఖాస్తులు చేసుకున్న విద్యార్థులంతా అధికారిక వెబ్‌సైట్‌ను సంద‌ర్శించి అక్క‌డ అందుబాటులో ఉన్న హాల్‌టికెట్ల‌ను డౌన్‌లోడ్ చేసుకొని, ప్రింట్ తీసుకోవాలి.

NEET PG Admissions: తుది దశకు నీట్‌–పీజీ అడ్మిషన్లు.. కటాఫ్ ఇలా..

దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 2, 2025న 100 కేంద్రాలలో పరీక్ష ఈ ప‌రీక్ష‌ను నిర్వహించనున్నారు. జామ్ 2025 అనేది 7 టెస్ట్ పేపర్‌లతో జరిగే కంప్యూటర్ ఆధారిత (CBT) పరీక్ష. ఈ పరీక్షలో 3 రకాల ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఉంటాయి. ఈ ప‌రీక్ష‌కు అభ్య‌ర్థులు అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసేందుకు అధికారిక వెబ్‌సైట్‌ను సంద‌ర్శించి, అక్క‌డ‌ రిజిస్టర్ నెంబర్, పాస్‌వర్డ్ వంటి వారి లాగిన్ వివరాలను ఎంటర్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవాలి. 22 ఐఐటీలు, ఇతర భాగస్వామ్య సంస్థలలో మాస్టర్ ఆఫ్ సైన్స్ (MSc, MSc-PhD) కంబైన్డ్ కోర్సులలో అడ్మిషన్ కోరుకునే వారి కోసం ఈ పరీక్షను నిర్వహించనున్నారు.

AP Intermediate Education Board News: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్‌ విద్యలో సంస్కరణలు

మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు (ఎంసీక్యూ), మల్టీ చాయిస్ ప్రశ్నలు (ఎంఎస్‌క్యూ), న్యూమరికల్ ఆన్సర్ టైప్ (ఎన్ఏటీ) ప్రశ్నలు ఉంటాయి. అర్హత సాధించిన అభ్యర్థులు 2025-26 విద్యా సంవత్సరానికి ఐఐటీలో సుమారు 3వేల సీట్లకు అర్హులు, అదనపు ఎవాల్యుషన్ ప్రాసెస్ అవసరం లేదు.

ఐఐటీ జేఎఎం ప‌రీక్షకు సంబంధించిన‌ అడ్మిట్ కార్డ్‌లను ఇలా డౌన్‌లోడ్ చేయాలి..

1. మొద‌ట‌గా ఐఐటీ జామ్ అధికారిక వెబ్‌సైట్‌ jam2025.iitd.ac.inను ఓపెన్‌ చేయండి.
2. హోమ్ పేజీలో క‌నిపించే ఐఐటీ జామ్ అడ్మిట్ కార్డ్ 2025 డౌన్‌లోడ్ లింక్ క‌నిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.
3. మ‌రో పేజీ తెరుచుకుంటుంది. అక్క‌డ అడిగిన‌ లాగిన్ వివాల‌ను నమోదు చేయండి. ఆపై సబ్మిట్ బ‌ట‌న్‌పై క్లిక్ చేయండి.
4. ఇక మీకు మీ అడ్మిట్ కార్డ్‌ను ప్ర‌వేశ‌పెడుతుంది. దానిలోని మీ వివరాల‌ను పూర్తిగా చెక్ చేయండి. ఆ తర్వాత మీ 
అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసి, ప్రింట్ తీసుకోండి.
5. ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం ప్రింట్‌ తీసుకోండి.

ఐఐటీ జామ్ ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన‌ ఫలితాలను మార్చి 16, 2025న ప్రకటించనున్నట్లు ప్ర‌క‌టించారు అధికారులు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

#Tags