College Students: విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ప్రణాళిక

ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు ప్రైవేటు కళాశాలల వైపు దృష్టి సారించకుండా ఉండటానికి ఇప్పటి నుంచే ప్రచారం చేస్తున్నారు.

‘‘మా కళాశాలలో చేరండి, ఉచితంగానే నాణ్యమైన బోధనతో పాటు, పాఠ్య పుస్తకాలు, స్కాలర్‌షిప్‌ ఇప్పిస్తాం’’ అంటూ ప్రచారం చేస్తున్నారు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల అధ్యాపకులు. 2024–25 విద్యా సంవత్సరానికి గాను ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో అడ్మిషన్ల సంఖ్యను పెంచుకోవడానికి ముందస్తు ప్రచారానికి అధ్యాపకులు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు ప్రైవేటు కళాశాలల వైపు దృష్టి సారించకుండా ఉండటానికి ఇప్పటి నుంచే ప్రచారం చేస్తున్నారు. జిల్లాలో 16 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు ఉన్నాయి.

English Medium: ఆంగ్ల మాధ్యమం అనుసరణీయం

వీటిల్లో ఆంగ్ల మాధ్యమంతో పాటు తెలుగు మీడియంలోనూ బోధన సాగుతోంది. ప్రైవేటు కళాశాలలతో పాటు కార్పొరేట్‌ కళాశాలల పోటీ వల్ల ప్రభుత్వ కళాశాలల్లో ఏటేటా విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోంది. ఫలితంగా కళాశాలల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలో విద్యార్థుల సంఖ్యను పెంచుకోవడానికి ముందస్తు ప్రణాళికను సిద్ధం చేశారు. ప్రభుత్వ అధ్యాపకులు రోజుకు కొన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో అవగాహన సదస్సులను నిర్వహిస్తున్నారు. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ గ్రూపులతో పాటు వోకేషనల్‌ కోర్సులలో అడ్మిషన్లకు అవకాశం ఉందని అధ్యాపకులు ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే ప్రైవేటు, కార్పొరేట్‌ కళాశాలల ప్రచారం చాపకింద నీరులా సాగుతుంది. అంతలోనే ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల ప్రచారం ఆరంభం కావడం విశేషం.

#Tags