శాతవాహనులు-ముఖ్యాంశాలు
- ఆంధ్ర శబ్దాన్ని పేర్కొంది - ఐతరేయ బ్రాహ్మణం
- ఆంధ్ర పథాన్ని ప్రస్తావించింది - భీమసేన జాతకం
- ఆంధ్ర నగరిని పేర్కొంది - సెరివణిజ జాతకం
- త్రిలింగ దేశాన్ని ప్రస్తావించింది - శక్తి సంగ్రమ తంత్రం
- శాతవాహనులు, పురాణాల్లో పేర్కొన్న ఆంధ్ర భృత్యులు ఒకరేనని ఆర్.జి.భండార్కర్ అభిప్రాయపడ్డారు.
- శాతవాహనుల ఆదిమ నివాసం నాసిక్ ప్రాంతమని పి. శ్రీనివాస అయ్యంగార్ గోపాలాచారి, పులాస్కర్ పేర్కొన్నారు.
- వి.ఎన్.సుంక్తాంకర్ అభిప్రాయంలో శాతవాహనుల తొలి నివాసం ‘బళ్లారి’ ప్రాంతం.
- శాతవాహనులు గోదావరి, కృష్ణా, మండల వాసులని వి.ఎ.స్మిత్, రాయ్ చౌదరి, గుత్తి వెంకట్రావ్‌లు అభిప్రాయపడ్డారు.
- ‘వాసుదేవ విష్ణు మిరాసీ’ అభిప్రాయంలో శాతవాహనుల జన్మభూమి విదర్భ ప్రాంతం.
- శాతవాహనుల ప్రాచీన రాజధాని శ్రీకాకుళం (కృష్ణాజిల్లా) ఆ తర్వాత వరుసగా ధాన్యకటకం, ప్రతిష్టానపురాలని ఎల్.డి.బార్నెట్ అభిప్రాయపడ్డారు.
- సంస్కృత భాషలో ‘శర్వవర్మన్’ కాతంత్ర వ్యాకరణం రచించాడు.
- ఆచార్య నాగార్జునుడు సుహృల్లేఖ గ్రంథాన్ని సంస్కృత భాషలో రచించాడు.
- ప్రాకృత భాషలో హాలుడు రచించిన గ్రంథం‘గాథాసప్తశతి’.
- నానాఘట్ శాసనాన్ని మొదటి శాతకర్ణి భార్య నాగనిక వేయించింది.
- నాసిక్ శిలా శాసనాన్ని గౌతమీపుత్ర శాతకర్ణి తల్లి గౌతమీ బాలాశ్రీ వేయించింది.
- హతిగుంఫా శిలాశాసనాన్ని - కళింగాధిపతి ఖారవేలుడు (ఒడిశా) వేయించాడు.
- క్రీ.శ.150లో శకరాజైన రుద్రదమనుడు మొట్ట మొదటిసారిగా సంస్కృత భాషలో వేయించిన శాసనం ‘గిర్నార్ శాసనం’
- శాతవాహన రాజ్య స్థాపకుడు - శ్రీముఖుడు
- రెండు అశ్వమేధ, ఒక రాజసూయ యాగం చేసిన శాతవాహన రాజు - మొదటి శాతకర్ణి
- మొదటి శాతకర్ణికి గల బిరుదులు - దక్షిణాపథపతి, ఏక వీరుడు, శూరుడు
- కార్షాపణులు అంటే - వెండి నాణేలు
- మధ్యప్రదేశ్‌లో ఉన్న సాంచీ స్థూపానికి దక్షిణ తోరణ ద్వారాన్ని నిర్మించిన శాతవాహన రాజు - రెండో శాతకర్ణి
- ఏ శాతవాహన రాజు కాలంలో ప్రాకృత భాష స్థానంలో సంస్కృతం రాజ భాష అయింది?
- కుంతల శాతకర్ణి - 17వ శాతవాహన రాజైన హాలుడికి గల బిరుదు?
- కవి వత్సలుడు - లీలావతి పరిణయ కావ్యాన్ని రచించింది - కుతూహలుడు
- కావ్య మీమాంస గ్రంథాన్ని రచించింది - రాజశేఖరుడు
- నహపాణుని రాజధాని - మిన్నగార
- ‘క్షహరాట వంశ నిరవశేషకర’అనే బిరుదు ఎవరికి ఉంది?
- శకరాజైన నహపాణుడికి - క్షత్రియ దర్పమాన, త్రిసముద్రతోయ పీతవాహన, ఏకబ్రాహ్మణ, ఆగమనిలయ అనే బిరుదులున్న శాతవాహన రాజు?
- గౌతమీపుత్ర శాతకర్ణి - నహపాణుడు (శకరాజు) వేయించిన వెండి నాణేలు ఎక్కడ లభించాయి?
- మహారాష్ర్టలోని జోగల్‌తంబిలో - నాణేలపై ఓడ బొమ్మలు ముద్రించిన శాతవాహన రాజు?
- యజ్ఞశ్రీ శాతకర్ణి - పురుషార్థాలు అంటే - ధర్మ, అర్థ, కామ, మోక్షాలు
- ఆహారాలు అంటే - రాష్ట్రాలు
- నిగమాలు అనగా?
- ప్రధాన నగరాలు - గ్రామిణి, గుల్మిక, గ్రామిక పదాలు దేన్ని సూచిస్తాయి?
- గ్రామ పరిపాలనాధికారిని - ఒక వృత్తిని అనుసరించే వారిని శ్రేణులు (సంఘాలు)అంటారు. దీని అధ్యక్షుడు శ్రేష్టి
- స్కంధావారం అంటే - సైనిక శిబిరం
- సాగుభూమిని కొలిచేందుకు ‘రజ్జు’ అనే కొలమానాన్ని వాడేవారు. భూమి కొలతలు, లావాదేవీలను పర్యవేక్షించే వారిని రజ్జు గాహకుడు అనేవారు.
- వృత్తి పనులవారు కరుకర అనే పన్నును చెల్లించేవారు.
- దక్షిణ భారతదేశంలో మొదటిసారిగా ‘భూదానం’ చేయడం అనే ప్రక్రియను శాతవాహనులే ప్రారంభించారు.
- కుటుంబ పెద్దను గహపతి (గృహపతి) అని పిలిచేవారు.
- ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట చిహ్నం పూర్ణ కుంభాన్ని అమరావతి స్థూపంనుంచి తీసుకున్నారు.
- మధ్యప్రదేశ్‌లోని ‘విదిశ’ ప్రాంతంలో హోలియో డోరస్ క్రీ.పూ.1వ శతాబ్దంలో వేసిన స్తంభ శాసనం భాగవత మతం గురించి ప్రస్తావించింది.
- ఆంధ్ర దేశంలో అతి ప్రాచీనమైన గుడి మల్లం శివలింగం చిత్తూరు జిల్లాలో లభ్యమైంది.
ఆంధ్ర దేశంలో అతి ప్రాచీన స్థూపం (క్రీ.పూ.2వ శతాబ్దం) ‘భట్టిప్రోలు’ (గుంటూరు జిల్లా)లో లభించింది. - పశ్చిమ గోదావరి జిల్లాలోని గుంటుపల్లి గుహాలయాలు శాతవాహనుల కాలంలో నిర్మాణమయ్యాయి.
- శాతవాహన రాజుల ఆజ్ఞలను అమలు చేయటానికి ‘అక్ష పటలం’ అనే సచివాలయం ఉండేది.
- శాతవాహనుల కాలం నాటి చిత్రలేఖనాలు అజంతాలోని 9.10 గుహల్లో ఉన్నాయి.
- చైత్యగృహాలు అంటే బౌద్ధుల ప్రార్థనా స్థలాలు.
- తిలపిష్టకులు అంటే ఎవరు?
- తెలకలివాళ్లు (గానుగ ద్వారా నూనె తీసేవారు) - గధికులు అంటే - మందులు తయారుచేసేవారు
- సార్థవాహులు అంటే ఎవరు?
ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వస్తువులు తీసుకొనిపోయి వ్యాపారం చేసేవారు - కోలికులు అంటే - సాలెవారు
- ఒసకరులు అంటే - మేదర్లు
- వజ్రయానం అంటే - బుద్ధుడిని తాంత్రిక పూజా విధానంలో పూజించడం
- శాతవాహనుల ప్రధాన ఆదాయం భూమిశిస్తు. పంటలో 1/6 వంతును శిస్తుగా వసూలు చేసేవారు.
- కొండ కుందాచార్యుడు ‘సమయసారం’ అనే గ్రంథాన్ని రచించాడు. ఇతడు శాతవాహన రాజుల సమకాలికుడు.
- ‘కథా సరిత్సాగరం’ను సంస్కృత భాషలో ‘సోమదేవసూరి’ రచించాడు.
- బృహత్కథా శ్లోక సంగ్రహం రచయిత - బుధస్వామి
- మహాయాన మాధ్యమిక సిద్ధాంత కర్త - ఆచార్య నాగార్జునుడు
#Tags